మోదీ పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి వుంది
రైతులకు అన్యాయం
ఆర్థిక పురోగతి సున్నా
మాజీ ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ,మే27(జనంసాక్షి):
ప్రధానిగా తాను ఎప్పుడూ పదవిని దుర్వినియోగం చేయలేదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలిపారు. ఎన్డీయే ఏడాది పాలనపై మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. మోదీ పాలనలో రైతులకు అన్యాయ జరుగుతోందని, కేవలం కాలక్షేపం మఆటలతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూనే,. యూపీఏ పథకాలనే ఎన్డీఏ కాపీ కొడుతుందన్నారు. . ప్రభుత్వం ప్రతిపక్షాలను వివాదాల్లోకి లాగడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తాను పదవిని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. అవినీతికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. ఎన్డీఏ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని ఆయన పేర్కొన్నారు. అలాగే తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు తాను ఎటువంటి ఆశ్రిత పక్షపాతం చూపించలేదని వివరణ ఇచ్చారు. ప్రధాని కార్యాలయాన్ని తన సొంతానికి, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం వాడుకోలేదన్నారు. అవినీతి పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల దృష్టిని అనవసర విషయాలవైపు మళ్లిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక అభివృద్ధి స్తంభించిందన్న ఆరోపణలను మన్మోహన్ సింగ్ తోసిపుచ్చారు. తాము దిగిపోయే నాటికి మనదేశం ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధించిన రెండో ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. మోదీ ఏలుబడిలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2జీ టెలికం లెసైన్సుల విషయంలో సహకరించకుంటే హాని చేస్తానంటూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ తనను బెదిరించారని ట్రాయ్ మాజీ చీఫ్ ప్రదీప్ బైజాల్ తన పుస్తకంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిని మన్మోహన్ ఖండించారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని తన స్వార్థానికి వాడుకోలేదని, తన కుటుంబాన్ని, మిత్రులను ధనవంతులను చేసేందుకు ప్రయత్నించలేదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. అవినీతి ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ భాజపా ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్‌డీయే పాలనలో ఆశించినంత మేర ఆర్థిక పురోగతి లేదని మాజీ ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు.