యమునా నది తీరంలో పీవీకి స్మారక చిహ్నం

1
న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి): భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన పీవీ నరసింహరావుకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా పీవీ మెమోరియల్‌ ఘాట్‌ ని నిర్మించాలని ప్రతిపాదనలని సిద్ధం చేస్తొంది. పీవీ మరణానికి ముందు నుంచే ఆయనకి సముచిత స్థానం ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ విస్మరించింది. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధాన మంత్రి స్థాయికి చేరి, ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చి దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిది. యమునానది ఒడ్డున ఏక్తా స్థల్‌ సమాధి కాంప్లెక్స్‌ సముదాయంలో పీవీ మెమోరియల్‌ ఘాట్‌ను  నిర్మించడానికి మంత్రిమండలి అమోదం కోసం పట్టణ అభివృద్ధిమంత్రిత్వశాఖ గత వారం ఒక ప్రతిపాదన పంపినట్టు సమాచారం. ఇప్పటికే పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ రోెజురోజుకు పరుగుతోంది.