యువజన ర్యాలీ ఉద్రిక్తం
భూసేకరణ అన్యాయం
దిల్లీలో యూత్ కాంగ్రెస్ ఊరేగింపు
న్యూదిల్లీ,మార్చి16(జనంసాక్షి): పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారం కోల్పోయాక తొలిసారి ఢిల్లీ రోడ్లపై ఆందోళనకు దిగింది. భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో యువజన కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. పార్లమెంటువైపు వెళ్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ యువజన కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీని అడ్డుకోవడంతో పోలీసులకు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగింది. పార్లమెంట్ వైపు వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. పోలీసులపై కొందరు కార్యకర్తలు తిరగబడ్డారు. తిరగబడ్డ కార్యకర్తలపై పోలీసులు వాటర్‌క్యాన్లు ప్రయోగించారు. భూసేకరణ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. పోలీసులపై కార్యకర్తలు తిరగబడడంతో వారు నీటి ఫిరంగులను ప్రయోగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. భూసేకరణ సవరణ బిల్లుపై కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. కొద్ది రోజుల క్రితం ధర్నా చేపట్టిన కాంగ్రెస్ సోమవారం నాడు ర్యాలీ నిర్వహించింది. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనగా పార్లమెంటు వైపు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.దాంతో ఇద్దరి మద్య తోపులాట జరిగింది.కార్యకర్తలు పోలీసులను ఎదిరించడంతో వారు నీటి కాన్ లను ఉపయోగించి చెదరగొట్టడానికి యత్నించారు.బిజెపికి వ్యతిరేకంగా పోరాడడానికి కాంగ్రెస్ సిద్దమవుతోందని యూత్ నేతలు చెప్పారు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. బట్టాపర్సోల్ నుంచి పార్లమెంట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రైతు వ్యతిరేకి అయిన మోదీ ప్రభుత్వం నాశనమవుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా సభలోనూ, బయటా పోరాడుతామని ఆన్నారు. భూసేకరణ బిల్లు కేవలం వ్యాపారవేత్తలకు మాత్రమే అనుకూలంగా ఉందని, ప్రధాని మోదీ రైతుల వ్యతిరేకి అని ఆయన విమర్శించారు.