యువజన విభాగం ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం.
హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 22(జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ ఇంచార్జ్ గా వున్న మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో హుస్నాబాద్ మండలం పార్టీ అధ్యక్షులు వంగ వెంకటరాంరెడ్డి ఆదేశాల మేరకు హుస్నాబాద్ యువజన విభాగం అధ్యక్షులు కొలిపాక తిరుపతి ఆధ్వర్యంలో శనివారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి వెంట పార్టీ శ్రేణులు ఉన్నారు.