యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌!

వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. సాంగ్‌ సెర్చ్‌ (Song Search) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు.

యూట్యూబ్‌లోని వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌ ద్వారా సాంగ్‌ సెర్చ్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. గూగుల్‌ సెర్చ్‌లోని హమ్‌ టు సెర్చ్‌ (Hum To Search) ఫీచర్‌ స్ఫూర్తితో ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది. యూజర్లు తమకు నచ్చిన పాట లేదా మ్యూజిక్‌ కోసం మైక్‌ సింబల్‌పై క్లిక్ చేసి మూడు సెకన్లపాటు హమ్‌ చేస్తే.. సెర్చ్‌ రిజల్ట్‌లో ఒరిజనల్‌ పాటతోపాటు, యూజర్‌ క్రియేట్‌ చేసిన కంటెంట్‌, షార్ట్స్‌లోని కంటెంట్‌లో సదరు పాటకు సంబంధించిన వీడియోలను చూపిస్తుంది.

హ్యాపీబర్త్‌డే విండోస్‌.. స్పెషల్‌ గిఫ్‌ షేర్‌ చేసిన బిల్ గేట్స్‌

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యూట్యూబ్‌ తెలిపింది. 2020 నుంచి గూగుల్‌లో హమ్‌ టు సెర్చ్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు అదే సాంకేతికతతో యూట్యూబ్‌లో సాంగ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది. గూగుల్ హమ్‌ టు సెర్చ్‌లో అయితే 15 సెకన్లు హమ్‌ చేయాలి. కానీ, యూట్యూబ్‌లో కావాల్సిన పాట కోసం మూడు సెకన్లు హమ్‌ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌లో యూజర్‌ ఇంటర్‌ ఫేజ్‌కు సంబంధించి కూడా స్వల్ప మార్పులు చేయనున్నట్లు సమాచారం. దీంతో యూజర్లు సులువుగా ట్రాక్‌లను మార్చుకోవచ్చు. అలాగే, క్రోమ్‌ కాస్ట్‌లో మ్యూజిక్‌ యాప్‌ను సులువుగా యాక్సెస్‌ చేసేందుకు వీలుగా కొత్త ఆప్షన్లను పరిచయం చేయనుంది.

తాజావార్తలు