యెమెన్‌లో ముదురుతున్న సంక్షోభం

4

సనా, టెహ్రాన్‌,మార్చి26(జనంసాక్షి): గల్ఫ్‌లో మరో సంక్షోభం తలెత్తింది. ుౖమెన్‌లో పోరాటం ఉద్ధృత రూపం దాల్చింది. హుతి తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని… సౌదీ అరేబియా గురువారం వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి అమెరికా వ్యూహాత్మక మద్దతు పలికింది. షియాలకు చెందిన ‘హుతి’ దళం నుంచి ుౖమెన్‌ చట్టబద్ధ ప్రభుత్వాన్ని కాపాడటం కోసం… ఆ దేశ అధ్యక్షుడు అబ్దెరబ్బో మరీ|్సర్‌ హాది చేసిన విజ్ఞప్తిమేరకే అక్కడ సైన్యం దాడులు ప్రారంభించినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దాడుల్లో ఐదు గల్ఫ్‌ రాజ్యాలు సహా మొత్తం పది దేశాలు పాల్గొననున్నట్లు సౌదీ పేర్కొంది. హుతి తిరుగుబాటుదారులపై సౌదీ చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌కు వ్యూహాత్మక తోడ్పాటు అందించనున్నట్లు అమెరికా తెలిపింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొనాలంటూ సౌదీ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు పాకిస్థాన్‌ కూడా పేర్కొంది. మరోవైపు, ుౖమెన్‌లో సౌదీ చేస్తున్న దాడులతో… ఆ దేశంలో పరిస్థితులు మరింత దిగజారుతాయని, వెంటనే దాడులను నిలిపివేయాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసింది. ుౖమెన్‌లో ప్రస్తుత సంక్షోభాన్ని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడతామని పేర్కొంది. హుతి తిరుగుబాటుదారులకు తాము డబ్బు, శిక్షణ అందిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్‌ ఖండించింది.