రష్యాలో కూలిన దుబాయ్‌ విమానం

1

– 62 మంది దుర్మరణం

మాస్కో,మార్చి19(జనంసాక్షి):  రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం దుబాయ్‌కు చెందిన ప్యాసింజర్‌ విమానం రష్యాలోని రోస్తవ్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది, 55మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం దుబాయ్‌ నుంచి ప్రయాణికులతో రష్యాలోని రోస్తవ్‌ బయల్దేరింది. రష్యాలోని రోస్తవ్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగి కుప్పకూలింది. ఈ ప్రమాదంతో రోస్తవ్‌ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. ఘటనాస్థలికి చేరుకున్న విమానయాన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.  ఈ ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది.విమానంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది సహా 61 మంది మృతిచెంచారు. కాగా.. ఇందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు.