రాజధానిగా భూముల రగడ తీరేదెలా..?

రాజధాని భూసేకరణ విషయంలో ఏం జరుగుతుందో కానీ ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు.  పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మాణం జరగబోతోంది. మూడు పంటలు, నిత్యం కళకళలాడే పంటపొలాలు కనుమరుగు కాబోతున్నాయన్నది సుస్పష్టం. ఎల్లవేళలా నీటి సౌకర్యం ఉండి 365 రోజులు వంద రకాల పంటలు పండే అనుకూలమైన భూములను రాజధీనికి సేకరించడం అవసరమా అన్న చర్చ సాగుతోంది. దీనికితోడు రాజధానికి ఇంతటి సారవంతమైన భూములు ఇవ్వబోమని కొందరు రైతులు ఢిల్లీకి ఎక్కారు. మరికొందరు తమతో బలవంతగా భూములు తీసుకున్నారనని, తమవి తమకు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఒకటి విజయవాడను కాదని కొత్తగా రాజధాని నిర్మించడం అదీ, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో అవసరమా అన్నది గుర్తుంచుకోవాలి. అలాగే కొత్త రాజధానికి పంటలు పండే భూములు అవసరమా అన్నది కూడా గమనించాలి. ఇకపోతే వేలాది ఎకరాలు భూమి సేకరించడం అవసరమా అన్నది కూడా చర్చించాలి. మరోటి రైతులు తమ నోటికాడి ముద్దను వదులుకుని భూమి ఇవ్వాలా అన్నది కూడా ఆలోచించాలి. మద్రాస్‌ నుంచి విడిపోయిన తరవాత విజయవాడను రాజదాని చేయకుండా చేశారని ఆనాడే ఆరోపణలు వచ్చాయి. ఆనాడే విజయవాడను రాజధాని చేసి ఉంటే ఇంతగా సమస్యలు వచ్చేవి కావని నేటికీ అంటుంటారు. ఇప్పటికీ అదే తప్పు చేస్తున్నారా అన్న భావన వస్తోంది. విజయవాడ అన్ని విధాలుగా బాగా అభివృద్ది చెందిన పట్టణం. దీనిని ఎందుకనో రాజధానిగా చేసుకోలేకోతున్నారు. లేదా గుంటూరును అయినాచేసుకోవచ్చు. విభజన తరవాత విజయవాడను రాజధానిగా చేసుకుని విజయవాడ చుట్టూ అభివృద్ది చేసుకునే వీలుంది. హైదారాబాద్‌ను అభివృద్ది చేశానంటున్న చంద్రబాబు విజయవాడను హైదరాబాద్‌కు ధీటుగా, స్మార్ట్‌ సిటీగా డెవలప్‌ చేసి రాజధానిగా కొరసాగించి ఉంటే బాగుండేది. భూసేకరణ, ఆర్థిక ఇబ్బందులు  తదితర సమస్యలు వచ్చేవి కావు. విజయవాడకు చుట్టూ వేలాది ఎకరాల భూమి లభ్యత ఉంది. విజయవాడ చుట్టూ గుంటూరు, తెనాలి, గన్నవరం, మచిలీపట్టణం, ఏలూరు, ఇబ్‌ంరహీం పట్టణం వరకు వేలాదిగా భూముల లభ్యత ఉంది. అయినా బాబు కొత్త రాజధానికే మొగ్గుచూపడం అదీ, రైతులనుంచి బలవంతంగా భూములను సేకరించీ చేపట్టడం అవసరమా అన్నదే ప్రశ్న. ఇక ఇటీవలే జగన్‌ రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులు మస్యలను తెలుసుకున్నారు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ కూడా పర్యటించి తుఫాన్‌ సృష్టించారు. దీంతో ఇప్పుడు చర్చ పవన్‌ కళ్యాణ్‌ పై పడింది. ఇంతకాలం సైలంట్‌గా ఉన్నా పవన్‌ అకస్మాత్తుగా అక్కడి రైతులపై ఎందుకు ప్రేమ పుట్టిందన్నది ముఖ్యం. నిజంగానే ఆయన రైతుల పక్షాన ఉంటే రాజధానికి సంబంధించి విజయవాడను ప్రతిపాదించి, భూసేకరణ వద్దని గట్టిగా చెప్పాల్సి ఉండేది. కానీ అలా జరగలేదు. ఎన్నికల తర్వాత సినిమాలకే పరిమితమైన ఆయన కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు గానీ ఠక్కున పవన్‌ కల్యాణ్‌ రాజధాని కోసం భూములను సవిూకరిస్తున్న గ్రామాలలో ప్రత్యక్షమయ్యారు. మూడు నాలుగు గంటలపాటు సాగిన తన పర్యటనలో ఆయన రెండు మూడు రకాలుగా మాట్లాడారు. రైతుల కోసం పారాటమన్నాడు. వారికి అండగా ఉంటానన్నాడు. తానే వారి పక్షాన పోరాడుతానన్నాడు. ఇది జగన్‌కు చెక్‌ పెట్టడానికి జరిగిన పర్యటనా లేక రాజకీ ఉద్దేశాలతో కూడుకున్నదా లేక మరేదైనా అన్నది తేలాల్సి ఉంది. పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు సృష్టించిన హంగామా చూసిన వారికి ఏపీ ప్రజలపై జాలి పడాలో, కోప్పడాలో తెలియని పరిస్థితి. ఏపీకి ప్రత్యేక ¬దా రావడం లేదనీ, ఆర్థిక సహాయం సక్రమంగా అందడం లేదనీ ఆందోళన చెందుతున్న సమయంలో ఆయన తెరపైకి రావడం చర్చనఈయాంశంగా మారింది. రాజధాని గ్రామాల పర్యటన సందర్భంగా కాసేపు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం ప్రదర్శించారు. మరికాసేపటికి అంతా బాగుందని కితాబు ఇచ్చారు. భూములు సవిూకరిస్తున్న గ్రామాల ప్రజలు పార్టీల వారీగా చీలిపోయారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు స్వచ్ఛందంగా భూములు అప్పగించగా, వైసీపీ అభిమానులు మొరాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలివిగా  90 శాతానికిపైగా భూ సవిూకరణ పూర్తిచేసింది.  ఆ దశలో రైతుల కోసం పవన్‌ కల్యాణ్‌ పర్యటన పెట్టుకుని ఇక్కడకు రావడంలో ఆంతర్యం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన నిజంగానే రైతుల పక్షం అయితే వెంటనే రాజధాని ప్రాంత సమస్యలపై బాబుతో చర్చించాలి. కేంద్రంతో చర్చించాలి. వెంకయ్యతో చర్చించాలి. తాను చూసిన  కన్నీటి బాధలను ప్రజలకు తెలిసేలా కార్యాచరణ చేపట్టాలి. రాజధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసిన ఆయన మరుసటి రోజు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్వరం మార్చారు. భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ బాగుందని ప్రశంసించారు. రాష్టాన్రికి ప్రత్యేక ¬దా సాధించవలసిన బాధ్యత ఎంపీలపై ఉందన్న పవన్‌ ,మరుసటి రోజు మాటమార్చి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండవలసిన బాధ్యత బీజేపీపై ఉందని ప్రకటించారు.  రాజకీయాలలో కొనసాగాలా లేక సినిమాల్లో ఉండాలా అన్నది తేల్చుకోవాలి. సినిమాల్లో ఉంటూ రాజకీయాలుచేయాలనకుంటే ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడాలి. అందుకు తూళ్లూరు కేంద్రంగా పవన్‌ అన్యాయాలపై పోరుబాట చేస్తే మంచిది.