రాజ్యసభకు విజయ్‌మాల్యా రాజీనామా
న్యూఢిల్లీ,మే2(జనంసాక్షి): రాజ్యసభ సభ్యత్వానికి వ్యాపారవేత్త విజయ్ మాల్యా రాజీనామా చేశారు. తన సహచరులైన రాజ్యసభ సభ్యులు తనతో వ్యవహరించిన తీరుతో తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు చెప్పారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి తన సహచరులు సమర్పించిన నివేదికపై మాల్యా మండిపడ్డారు. భారత బ్యాంకులకు 12 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాల్యా తన రాజీనామా లేఖను పంపినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యత్వాన్ని పార్లమెంట్ రద్దు చేసేలోపే రాజీనామా చేసి మరింత అవమానం జరగకుండా మాల్యా జాగ్రత్త పడ్డాడు. ఇప్టపికే ఆయన అరెస్ట్‌కు వారంట్ జారీచేశారు. ఇడి నోటీసులకు స్పందించకపోవడంతో పాస్‌పోర్టు రద్దు చేశారు.