రాజ్‌భనవ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్,ఏప్రిల్ 7(జనంసాక్షి):శ్రీదుర్ముఖి నామ సంవత్సరం శుక్రవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం రాజభవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా
ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీ ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ దంపతులు అతిథులందరికి సాదరంగా స్వాగతం పలికారు. కొత్త ఆశలను చిగురింపజేసే ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్యంతో జీవనం సాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వేడుకల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ తేనేటి విందు ఇచ్చారు.ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు అందాలని, వాటితో రాష్ట్రం సుభిక్షం కావాలని పేర్కొన్నారు.
దుర్ముఖి అని భయపడకండి
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాజ్ భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. కేసీఆర్ దంపతులను గవర్నర్ దంపతులు ఈ సందర్భంగా సత్కరించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాజ్ భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. దుర్ముఖి నామా సంవత్సరంలో మనం భయపడవలసిన అవసరం లేదని, మంచి వర్షాలు పడతాయని, కరువు దూరమవుతుందని కేసీఆర్ అన్నారు. గవర్నర్ ఈ కార్యక్రమం చేయడం మనకు గర్వకారణమని కేసీఆర్ అన్నారు. దుర్ముఖి నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచంలోని తెలుగు వారందరికీ మంచి జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.కేసీఆర్ దంపతులను గవర్నర్ ఈ సందర్భంగా సత్కరించారు. కేసీఆర్ ఈ సందర్భంగా చిరంజీవి దంపతులను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ దంపతులు కొంత లేటుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, చిరంజీవి దంపతులు, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ యాదవ్, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ, ఏపీ డీజీపీలు, క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్, పలువురు అధికారులు, ప్రముఖులు కూడా పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.