రాములోరికి ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్
భద్రాచలం,మార్చి28(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం కన్నుల పండువగా అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితు మంత్రోఛ్ఛరణాల మధ్య స్వామి కళ్యాణం జరిగింది. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మిథిలా మండపంలో స్వామి కళ్యాణం వేదోక్తంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కల్యాణమ¬త్సవానికి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరంగం నుంచి అక్కడి వేదపండితులు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. అలాగే తిరుమల శ్రీవారి పక్షాన టిటిడి ఇవో సాంబశివరావు దందపతులు, చినజీయర్ స్వామి, శృంగేరి భారతీతీర్థస్వామి, గణపతిసచ్చిదానంద స్వామిల తరఫున కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. దేశ నలుమూల నుంచి తరలివచ్చిన భక్తులతో భద్రాద్రి భక్త జనసంద్రంగా మారింది. జైశ్రీరామ్ నినాదాల మధ్య ప్రశాంతగా కళ్యాణవేడుకలు జరిగాయి. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, తితిదే ఈవో సాంబశివరావు తదితరులు,టిటిడి మాజ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు భద్రాద్రి రామయ్యకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తొలితెలంగాణలో జరుగుతున్న ఈ కళ్యాణోత్సవాన్ని తికించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలంలోని పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.దేశ నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకున్నారు. ధ్రువమూర్తుల కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణమూర్తులను సుందరంగా అలంకరించి… కల్యాణ మండపానికి స్వామివారి వూరేగింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30గంటల వరకు సీతారాముల కల్యాణ మ¬త్సవం వైభవోపేతంగా సాగింది. ఓ వైపు భద్రాచలంలో రాములోరి పెళ్లి సందడి ,శ్రీరామనామస్మరణతో పుణ్య గోదావరి తీరం మార్మోగింది. ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపానికి సీతారాముల దివ్యమూర్తులను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణంచేపట్టారు. కల్యాణ మ¬త్సవానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం ఇదే తొలిసారి. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను కేసీఆర్ సమర్పించారు. కల్యాణ మ¬త్సవం అనంతరం ఆలయానికి స్వామివారి ఊరేగింపు ఉంటుంది. మిథిలా మంటపాన్ని రాముల వారి కల్యాణం కోసం సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో పాటు భద్రచలం అంతటా భక్తులతో సందడిగా నెలకొంది. విద్యుద్దీపలంకరణతో పట్టణం అంతటా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.