రాహుల్‌పై నిఘానేత్రం

3

-భగ్గుమన్న కాంగ్రెస్‌్‌

న్యూఢిల్లీ,మార్చి14(జనంసాక్షి): ఎఐసిసి ఉపాధ్యక్షుడు రా హుల్‌ గాందీ కార్యాలయానికి కొందరు పోలీసులు వచ్చి ఆరా తీసిన విసయంపై  కాంగ్రెస్‌ మండిపడుతోంది. వ్యక్తిగత వ్యవ హారాల్లోకి రావడంపై అగ్గివిూద గుగ్గిలం అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో పోలీసులు రాహుల్‌ గాంధీకార్యాల యానికి వచ్చి ఆయన షేప్‌, కళ్ల రంగు, జుట్టు రంగు మొదలైన వాటి గురించి ఆరా తీశారని సమచారం. ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారని రాహుల్‌ గాంధీ కార్యాలయంలో ఉన్న వారు అడిగినా పోలీసులు ఎలాంటి జవాబు చెప్పలేదు. ఇది కేవలం అనవసర చొరబాటేనని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. దీనిపై పోలీ సులు ఉన్నతాధికారులు కూడా నోరు మెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులపై నిఘా పెడుతోందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌లు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహాంపై 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను కేంద్ర ¬ం శాఖ ఆదేశించింది. అసలే రాహుల్‌ గాంధీ గత కొన్ని రోజులుగా ఎక్కడో మకాం వేశారని ప్రచారం జరుగుతుంటే, పోలీసులు ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా కాంగ్రెస్‌ ను మరింత చికాకుపరిచినట్లుగా ఉంది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎలా ఉంటారో, ఆయన రూపు రేఖలేంటో చెప్పాలంటూ ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టిన వ్యవహారం  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు నేరుగా రాహుల్‌ గాంధీ కార్యాలయానికి వెళ్లి ఆయన ఎలా ఉంటారు? ఆయన రంగు, కళ్లు, జుట్టు ఎలా ఉంటాయి? అని అక్కడి నేతలను అరా తీశాడు. అయితే ఇదంతా ఎందుకు అడుగుతున్నారని కార్యాలయ వర్గాలు ప్రశ్నించగా ఆ పోలీసు అధికారి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెనుదిరిగిపోయాడు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన రాహుల్‌ కార్యాలయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. రాహుల్‌ సెలవులో ఉన్న సమయంలో ఆయన గురించి ఎందుకు ఆరా తీస్తున్నారన్న సందేహాలు తలెత్తాయి. రాహుల్‌ గాంధీ రూపురేఖలు తెలవాలంటే ఇంటర్నెట్‌లో ఫోటోలు, యూట్యూబ్‌లో వీడియోలు చూడొచ్చు కదా.. నేరుగా కార్యాలయానికి వచ్చి ప్రశ్నించడం దేనికి అని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్‌ కార్యాలయానికి పోలీసులు రావడాన్ని పార్టీ వర్గాలు అనవసర చొరబాటుగా పరిగణించారు. అయితే రాహుల్‌ గురించి ఆరా తీసిన పోలీసును కార్యాలయ వర్గాలు ఫోటో తీశాయి. ఆ ఫోటో ఆధారంగా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.  వచ్చింది ఎవరన్న వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.  మరోవైపు ఈ వ్యవహారంపై విూడియా ప్రతినిధులు ఢిల్లీ పోలీసులను ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు వారు నిరాకరించారు.  ఇదిలాఉండగా రాహుల్‌ గాంధీ గురించి విచారణ వివాదాస్పదమైన నేపథ్యంలో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు అత్యవసర సమావేశమయ్యారు. భద్రత సవిూక్షలో భాగంగానే రాహుల్‌ గాంధీ గురించి ఆరా తీసినట్లు ఈ సమావేశంలో తేల్చారు. దేశ రాజధానిలో పెరిగిపోతున్న నేరాలను అరికట్టేందుకు గతవారం భద్రతా సవిూక్ష నిర్వహించారు. అదే విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులకు చెప్పినట్లు తెస్తోంది. అయితే ఆ వివరణలో కాంగ్రెస్‌ నాయకులు సంతృప్తి చెందలేదు. ఎస్పీజీ భద్రత ఉన్న ఇంటికి సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహించాల్సిన అవసరం ఏముందని వారు ఎదురు ప్రశ్నించారు. ఆ విచారణ రాజకీయప్రేరేపితమైనదని కాంగ్రెస్‌ మండిపడింది.