రుణపరిమితిని పెంచండి

5

-నీతి అయోగ్‌ సభ్యులతో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి):

మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్టాల్రకు అప్పులు తీసుకునే అవకాశం ఉండాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకు కేంద్రం వెసలుబాటు  కల్పించాలని అన్నారు.   నీతి ఆయోగ్‌ బృందం సభ్యులు గురువారం సచివాలయంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారికి సీఎం పలు విజ్ఞప్తులు చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధలను సడలించాలని,  రుణ పరిమితిని పెంచాలని  కోరారు. అప్పుడే రాష్టాల్రు అనుకున్న ప్రగతిని సాధింగలవని వివరించారు. రాష్టాన్రికి కేంద్ర నిధులు తగ్గాయి కాబట్టి అప్పులు తీసుకునే వెసులుబాటు మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు. మిషన్‌ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌, స్వచ్చ్‌ తెలంగాణకు కేంద్రం ఆర్థికసాయం అందించాలని కోరారు. వివిధ పథకాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో కేంద్ర ఆర్క్థసాయం లేదా అప్పులు అవసరమన్నారు.