రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి
ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్
న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి): నూతనంగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ గవర్నర్ నరసింహన్ సోమవారం సమావేశమయ్యారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన హస్తిన వెళ్లిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పధంలో ముందుకు వెళుతున్నాయని గవర్నర్ తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య లేదని,
అంతా ప్రశాంతంగా ఉందన్నారు. కొత్త ప్రభుత్వాల సంస్కరణలు త్వరలో ఫలితాలు ఇస్తాయని గవర్నర్ తెలిపారు.
ఇక ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్‌కు కట్టబెడతారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. కేవలం విూడియాలో అలాంటి వార్తలు వస్తున్నాయే తప్ప కేంద్రంనుంచి తనకు అలాంటి సమాచారమేది లేదని ఆయన చెప్పారు. ¬ంమంత్రితో తన సమావేశం మామూలుగా జరిగేదేనని, అందులో ఈ అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను, పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అంశాలను రాజ్‌నాథ్‌తో ప్రస్తావించారు. గవర్నర్ హైకోర్టు విభజన గురించి ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం పరిథిలోనే ఈ అంశం పరిష్కారమవుతుందని నరసింహన్ అన్నారు.