రెండు సదస్సులు-ఎన్నో ఆశాసూచికలు

మార్చి చివరి వారంలో విజయవాడలో, ఏప్రిల్‌ రెండోవారంలో నేపాల్‌ రాజదాని కాట్మండులో జరిగిన రెండు వేరువేరు సదస్సులు సమకాలీన మార్కిృస్టు ఆలోచనాదారలోని వైవిధ్యానికి అద్దం పట్టాయి. వేరేవేరే విషయాల మీద విభిన్న భౌగోళిక, రాజకీయ, సామజిక వాతవరణాల్లో జరిగినప్పటికీ, ఆ రెండు సదస్సులు కూడా మార్కిృస్టు సిద్దాంత సమస్యల గురించి ఎన్నో చర్చనీయాంశాలను వెలికి తెచ్చాయి. సమాజం పట్ల, సమాజ పరివర్తన పట్ట, భవిష్యత్తు పట్ల మార్కిృస్టు అవగాహన లోతు గురించి, విస్తృతి గురించి ఎన్నో ఆలోచనలను ప్రేరేపించాయి. ప్రజా ఉద్యామాల పురోగమనం గురించి ఆశలు కల్పించాయి.
విజయవాడ సదస్సు…
గుంటూరు కేంద్రంగా పది సంవత్సరాలకు పైగా దాదాపు వంద మార్కిృస్టు సిద్దాంత పుస్తకాలు ప్రచురించిన లెఫ్టిస్ట్‌ స్టడీ సర్కిల్‌ మార్చ్‌ 29, 30 తేదిల్లో విజయవాడలో భారతత సమాజం-ఉత్పత్తి విధాన పరిణామం లనే అంశం మీద చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత సమాజంలో ఉత్పత్తి విధానం (మోడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌) ఏమిటనేది మార్కిృస్టుల మధ్య గత నాలుగైదు దశాబ్దాలుగా ఎడతెగని చర్చగా ఉంటున్నది. మార్కిృజాన్ని చారిత్రక భౌతికవాదాన్ని శాస్త్రంగా గ్రహించేవారందరూ ఉత్పత్తి విధానమే సమాజానికి మూలమని, ఉత్పత్తి విధాన పరాణామం ద్వారానే సామాజిక పరివర్తన జరుగుతుందని భావిస్తారు. సమాజం దశలుగా పురోగమిస్తుందని, వర్గపోరాటం చోదశక్తిగా అది ఒక్కొక్క ఉత్పత్తి విధాన దశనూ దటూకుంటూ పయనిస్తుందని నమ్ముతారు. భారత సమాజ ప్రస్తుత దశ ఏమిటి? ఈ దశ నుంచి అది ఏ దశకు పరివర్తన చెందవలసి ఉంది, ఆ పరివర్తన దారితీసే వర్గపోరాటంలో పాల్గోనే, నాయకత్వం వహించే సామాజిక వర్గాలు ఏవి? ఆ పరివర్తనను అడ్డుకునే సామాజిక వర్గాలు ఏవి, అనే చర్చ మార్కిృస్టులకు మాత్రమే కాదు, సమాజ పురోగమనం గురించి ఆలోచించేవారందరికీ అత్యవసరమైన, కీలకమైన చర్చ. అఅటువంటి చర్చకు వేదిక కల్పించిన లెఫ్టిస్ట్‌ స్టడీ సర్కిల్‌ కృషి ప్రశంసనీయం. అయితే అసలు ఆ చర్చ అవసరమా అనే సందేహం కూడా కొంతమందిలోనైనా ఉంది. భారత సమాజ పరివర్తనకు, పురోగమానానికి చారిక్రతక భౌతిక వాద దృక్పథం అవసరం లేదని నమ్మే వారు భారత రాజకీయలలో, సామాజిక ఆలోచనాపరులలో చాలమందే ఉన్నారు. అసలు వ్యవస్థ మార్చే అవసరం లేదని, ప్రభుత్వాలు మారితే చాలునని, తమ వాటా పెరిగితే చాలునని అనుకుంటున్న వారు ఉద్యమాలలో కూడ ఉన్నారు. నిజానికి సంస్కరణలతో నాయకుల పబ్బం గడుస్తుందేమో గాని, దోపిడి పీడనలకు గురువతున్న అశేష భారత ప్రజానీకానికి ఏ మేలూ జరగదు. తమ నాయకులే, తాము నమ్ముకున్న రాజకీయ సామాజిక ఉద్యమపక్షాలే తమ నిజమైన మేలును కోరడం లేదని తెలియని అమాయకత్వంలో కోట్లాది ప్రజానీకం ఉన్నారు. తాము అనుసరిస్తున్న పార్టీ, లేదా తమ కులంలో మతంలో ప్రాంతంలో పుట్టిన నాయకుడు ఏదో ఒకరకంగా ప్రభుత్వాధికారం చేపడితే తమకు మేలు జరిగిపోతుందని భ్రమపడేవాళ్లు చాలామందే ఉన్నారు. తమను తాము మార్క్సిస్టులుగా, కమ్యూనిస్టులుగా చెప్పుకునేవారికి ఆ భ్రమలు ఉండకూడదు. ప్రభుత్వాధికారినికీ, రాజ్యాధికారినికీ మధ్య, సంస్కరణలకూ వ్యవస్థ మార్పుకు మధ్య తేడా వారికి తెలిసి ఉండాలి. కాని దురదృష్టవశాత్తు భారత సమాజంలో కమ్యూనిస్టులుగా, మార్కిస్టులుగా చలామణీ అవుతున్నవాళ్లు నిజంగా కమ్యూనిస్టులో మార్కిస్టులో కాదు. అందువల్ల మన సమాజంలో చాలా మంది ఆలోచనాపరులు కూడా సమాజ స్వభావం గురించి, వ్యవస్థ పరివర్తన గురించి తగినంతగా ఆలోచించడం లేదు.
అది అలా ఉంచి, సైద్ధాంతికంగా మార్కిస్టులందరూ చారిత్రక భౌతికవాద దృక్పథం కలిగి ఉంటారు గనుక, బారత సమాజంలో కూడా అన్ని సమాజాల లాగే భూస్వామ్య దశ నుంచి పెట్టుబడిదారీ దశ నుంచి సోషలిస్టు దశంలోకి పరివర్తన చెందుతుందని భావిస్తారు. ఈ పరివర్తనలో భారత సమాజం ఎంత దూరం ప్రయాణించింది, లేదా ప్రయాణించలేదు, ప్రస్తుతం ఏ దశలో ఉంది. అనేది నిర్ధారించుకోవడం వర్గపోరాటాన్ని నిర్వహించడానికి అత్యవసరం. కాని చాలామంది మార్క్సిస్టులు వర్గపోరాటాన్ని నిర్వహించవలసిన కర్తవ్యాన్నే వదిలేశారు. గనుక వారికి సమాజ స్వభావం గురించీ, దశ గురించీ, పరివర్తన ఇటువంటి చర్చ అవనసరాన్ని వాళ్లు కూడ గుర్తించడం లేదు, ఎప్పుడో తాము ఒక నిర్ధారణ చేశామనీ, మళ్లీ మళ్లీ దాని గురించి ఆలోచించనక్కరలేదని అనుకుంటున్నారు.
విశాలమైన వర్గపోరాటం అవసరం అలా ఉంచి, సమాజ స్వభావ నిర్ధారణ తక్షణ అవసరం గా కూడా ఉంది. రెండు పార్లమెం టరీ కమ్యూనిస్టు పార్టీలు భారత సమాజం పెట్టుబడిదారీ వ్యవస్థ అని ఎప్పటి నుంచో ప్రకటిస్తు న్నాయి. నక్సల్బరీ పంథా అది అర్థవలస అర్ధ భూస్వామ్యమని ప్రకటించింది. ఈ వాదనలకు తోడు భారత సమాజంలో పెట్టుబ డిదారీ విధానం ప్రవేశించిందని 1960ల నుంచే వాదిస్తున్నవారు, ఆ వాదనలను ఖండిస్తూ ఇది అర్థవలస అర్ధభూస్వామ్య వ్యవస్థేన ని అంటున్నావారు సామాజిక శాస్త్రవేత్తలలో ఎందరో ఉన్నారు. 1970ల నుంచే నక్సల్బరీ పంథాలను, సాయుధపోరాట వ్యూహాన్ని వదలదలచుకున్న పార్టీలూ గ్రూపులూ కూడ అర్ధభూస్వామ్య అర్ధవలస సూత్రీకరణకు కాలం చెల్లిందని, పెట్టుబడిదారీ విధానం ప్రవేశించిందని మాట్లాడుతున్నాయి. పెట్టుబడిదారీ విధానం ప్రవేశించిందని సూచికలను చూపుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ విధానాల తర్వాత మన సమాజ జీవితంలో ప్రవేశించిన అనేక పరిణామాలు పెట్టుబడిదారీ విధానానికి సూచికే అని వాదిస్తున్నాయి. ఈ స్థితిలో సమాజంలో వస్తున్న మార్పులను ఎలా అర్ధం చేసుకోవాలో, సమాజ స్వభావం ఏమిటో, తత్పలితమైన పోరాట వ్యూహం ఎలా ఉండాలో చర్చించవలసిన అవసరం ఎప్పూడు ఉంది, ఉంటుంది.
ఈ నేపథ్యంలో లెప్టిస్ట్‌ స్టడీ సర్కిల్‌ సీపీఐ, సీపీఎంల తోపాటు నక్సల్బరీ పంథాలోని విభిన్న పాయలను ఆహ్వానించి చర్చ నిర్వహించింది. సదస్సును సైద్దాంతిక ఆంశాలు, బారత ఉత్పత్తి విధాన చర్చ, ఇటీవల పరిణామాలు అనే మూడు భాగాలుగా విభజించారు. ప్రొ.డి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశంలో గడియారం భార్గవ( భారత ఉత్పత్తి విధానం కొన్ని సంవిధాన ప్రశ్నలు) ప్రొ. వి విరెడ్డి( ఉత్పత్తి విధానం: బావిసత్వం నుంచి పెట్టుబడిదారీ విధానం), రమేస్‌ పట్నాయక్‌ (భారత వ్యవసాయ రంగంలో భూస్వామ్య ఉత్పత్తి సంబంధాలు ఏ స్థాయిలో ఇంకా కొనసాగుతున్నాయి?) పత్రాలు సమర్పించగా, వేములపల్లి వెంకటరామయ్య ఈ ఆంశం మీద తన ఆలోచనలు పంచుకున్నారు. డా.కొల్లా రాజమోహన్‌ అధ్యక్షతన జరిగిన రెండో సమావేశంలో వి శ్రీనివాసరావు, భారత ఉత్పత్తి విధానంపైఊ ఆలోచనలు పంచుకోగా,గడ్డం కోటేశ్వర రావు భారతదేశంలో ఉత్పత్తి విధానం: కమ్యూనిస్టు పార్టీల్లో చర్చ అనే ఆంశంపై పత్రం సమర్పించారు. ప్రొ.కెఆర్‌ చౌదరి అధ్యక్షతన జరిగిన మూడో సమావేశంలో ఎస్‌ఏ విద్యాసాగర్‌ (వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ సంబంధాలను అర్థం చేసుకోవడం: శ్రీకాకుళం జిల్లాలో సూక్ష్మస్థాయి అధ్యయం), ఆర్‌వి రమణమూర్తి (భారత దేశంలో పెట్టుబడిదారీ అబివృద్ధి, వ్యవసాయ సంక్షోభం, ఒక వర్తమాన అంచనా), ఎ ప్రసాదరావు, కెఆర్‌ చౌదరి (ప్రపంచీకరణ కింద ఉత్పత్తి విధానం భారత వ్యవసాయం గురించి ఆలోచనలు), సి భాస్కరరావు (వర్తమాన భారతదేశం పెట్టబడిదారీ దేశమే), విప్లవ రచయితల సంఘం తరపున కార్యదర్శి వరలక్ష్మీ (అర్థభూస్వామ్య అర్థవలస ఉత్పత్తి సంబంధాల ప్రాసంగికత), టి లక్ష్మీనారాయణ (భారత వ్యవసాయంలో ఉత్పత్తి శక్తులలో, ఉత్పత్తి సంబంధాలలో మార్పులు) పత్రాలు సమర్పించారు. మూడు సమావేశాలలోనూ మొత్తంగా దాదాపు ముప్పై మంది చర్చలో పాల్గొని ప్రశ్నలు వేశారు. వివరణలు ఇచ్చారు. కొత్త ప్రతిపాదనలు చేశారు.
– ఎస్‌ వేణుగోపాల్‌
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో…