రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు


(గురువారం తరువాయి భాగం)
భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్య వ్యతిరేక వ్యవసాయ విప్లవం ద్వారా అర్థభూస్వామ్య అర్థవలస పాలనను కూలదోసి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేసి సోషలిస్టు విప్లవం వైపు పురోగమించాలని నక్సల్బరీ పంథా రూపొందించిన వ్యూహం ఇవాళ్టికి అక్షరలా సరిపోతుందని ఈ నాలుగు దశాబ్దాల పరిణామాలన్నీ మరింతగా రుజువు చేస్తున్నాయి. భారత ఉత్పత్తి విధానం మీద జరిగిన రెండు రోజుల చర్చ ఆ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది. చర్చలో గంభీరమైన విసయాలతో పాటు కొన్ని నేలబారు ఆలోచనలు కూడా కలిసి కలగూరగంపలా మారిపోవడం అనవసర విషయాల మీద కొంత సమయం వృధా కావడం, కొంతమంది వక్తలకు మౌళిక చారిత్రక భౌతికవాద అవగాహనలు ఉత్పత్తి విధానపు ప్రాముఖ్యత తెలియకపోవడం వంటి ప్రతికూల అంశాలు కొన్ని ఉన్నప్పటికీ, మొత్తం మీద ఎక్కువమంది హాజరు కావడం, శ్రద్దగా వినడం, చర్చలో పాల్గొనడం, ఇవాళ అత్యవసరమైన ఒక కీలక రాజకీయార్థిక విషయం మీద ఇంత పెద్ద ఎత్తున ఆసక్తి ఉండడం మౌలికమైన ఆలోచనా స్ఫోరకమైన అంశాలు చర్చకు రావడం వంటి ఆశాసూచికలు ఈ సదస్సును విజయవంతం చేశాయి.
కాట్మండు సదస్సు
విజయవాడ సదస్సు భారత సమాజ స్థితి గురించి, పురోగమన మార్గం గురించి ఆలోచనలు రేకెత్తిస్తే, సరిగ్గా రెండువారాల తర్వాత నేపాల్‌ రాజధాని కాట్మండులో కృష్ణసేన్‌ ఇచ్చుక్‌ సాంస్కృతిక్‌ ప్రతిష్టాన్‌ అనే సంస్థ ‘మార్క్సిజం, పోస్ట్‌ మార్క్సిజం, పోస్ట్‌ మాడర్నిజం’ అనే అంశం మీద నిర్వహించిన సదస్సు, ఆ సదస్సు, ఆ సందర్బంగా గడించిన మూడు రోజలు అనుభవాలు ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని ఆలోచనలను ప్రేరేపించాయి. కృష్ణసేన్‌ ఇచ్చుక్‌ గొప్ప విప్లవ కవి. 1956లో పుట్టిన కృష్ణసేన్‌ తన పందొమ్మిదో ఏటి నుంచే కవిత్వం రాస్తూ, 1991 నాటికి విప్లవ కవిగా శోకాంజలి అనే మొదటి కవితా సంపుటం అచ్చువేశాడు. ఆ తర్వాత పదకొండు సంవత్సరాల కాలంలో మరొక మూడు కవితా సంపుటాలు వెలువడ్డాయి. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్ట్‌లు నడిపిన విప్లవ కార్యక్రమాల్లో పాల్గొంటూ జైలు జీవితాన్ని అనుభవించాడు. అజ్ఞాతవాసంలో ఉన్నాడు. 2002లో ఆయనను ప్రభుత్వ బలగాలు చంపివేశాయి. ఆయన స్మృతిలో ఏర్పడిన సాంస్కృతిక సంస్థ నేపాల్‌ విప్లవోద్యమ స్పూర్తిని నిలిపి ఉంచడానికి ప్రయత్నిస్తున్నది.
నిన్న మొన్నటివరకు నేపాల్‌లో జరిగిన ప్రజాయుద్దం చాలమందికి ఆసక్తినీ, ఆశనూ కల్పించింది. ఆ తర్వాత 2005 నుంచి ప్రచండ నాయకత్వం విద్రోహానికి పాల్పడడం మొదలై, ప్రపంచ – బాబురాయ్‌ భట్టరాయ్‌ నాయకత్వం సాయుధ పోరాటాన్ని విరమించింది. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించి ఆయుధాలు అప్పగించి, ప్రజావిముక్తి సైన్యాన్ని బారక్‌లతకు పరిమితం చేసింది. అయినా నేపాల్‌ విప్లవోద్యమం గురించి ఇంకా వేచి చూడాలని చాలామంది భావించారు. కాని ఆ నాయకత్వం అవకాశావాదంతో రివిజనిజంతో నిండిపోయిందని ఆ పార్టీ శ్రేణులలో అత్యధికులు బావించిన సందర్భంగా గత సంవత్సరం జూన్‌లో పార్టీ నిట్టనిలువున చీలిపోయింది. ప్రచండ నాయకత్వం తమను తాము ఏకీకృత నేపాలీన కమ్యూనిస్టు పార్టీ మవోయిస్టు పార్టీ, మావోయిస్ట్‌ అనే పాత పేరుతోనే కొనసాగుతోంది. అప్పటి వరకూ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండిన మోహన్‌ బైద్య (కిరణ్‌) కొత్త విప్లవపార్టీకి అధ్యక్షుడయ్యాడు. ప్రచండ – బాబూరామ్‌ నాయకత్వం చేసిన విద్రోహం తర్వాత, ప్రభుత్వాధకారంలో ఉండి వారు దేశ వ్యాప్తంగా సాగించిన నష్టాల తర్వాత పునర్నిర్మాణ ప్రయత్నాలు ఎంత కష్టభరితంగా ఉంటాయో ఎవరైనా ఊహించవచ్చు. అందుకే ఈ పార్టీ కూడ తక్షణమే సాయుధ పోరాటానికి అవకాశం లేదని ప్రకటించింది. కాని భూఆక్రమణ పోరాటాలు, సామాజిక సమస్యల మీద పోరాటాలు, ప్రజాసంఘాల పునర్నిర్మాణం ప్రారంభించింది. ఈ క్రమంలోన.ఏ మేధావవులలో, విద్యావంతులలో మార్క్సిస్టు వ్యతిరేక భావాల ప్రచారాన్ని అడ్డుకునేందుకు పోస్ట్‌ మాడర్నిజం మీద సదస్సును నిర్వహించింది. నేపాల్‌ సమాజం ఇంకెంతమాత్రం అర్థభూస్వామ్య, అర్థవలస సమాజం కాదని, రాచరికం తొలగిపోవడంతో బూర్జువా ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైట్టేనని, తమ పార్టీ అంతకుముందు ప్రకటించిన నలభై అంశాల కార్యక్రమలో అత్యధిక భాగం నెరవేరామని ప్రధానమంత్రిగా ఉండిన రోజులలో బాబూరాయ్‌: ప్రకటించారు. కాని ఎవరైనా ఆ నలభై అంశాల కార్యక్రమాన్ని 2006 తర్వాత జరిగగిన పరిణామాలను పోల్చి చూస్తే ఆ కార్యక్రమంలో కనీస అంశాలు కూడ నెరవేరలేదని తెటతెల్లమవుతుంది. పైగా ఆ కార్యక్రమంలీఓ ఒక అంశమైన భూపంపిణీకి స్వయంగా ప్రచండ బాబూరాయ్‌ నాయకత్వమే తూట్లు పొడిచంది. అంతకుముందు ప్రజాయుద్ధ క్రమంలో స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెట్టిన భూమిని, ఆస్తులను తిరిగి భూస్వాములకు అప్పగించారు. నలభై అంశాల కార్యక్రమంలో ప్రధానాంశమైన భారత విస్తరణవాదం మీద విమర్శను వదులుకోవడం మాత్రమే కాదు, భారత ప్రభుత్వ సహకారం అవసరమని ప్రకటిస్తున్నారు.
ఈ నేపధ్యంలో భాగమే పోస్ట్‌ మాడర్నిజం మీద చర్చ మార్క్సిస్టు వ్యతిరేకులు మాత్రమే కాక, మార్క్సిజం మీద అనుమానాలు మొదలైనవి వాళ్లు కూడ పోస్ట్‌ మాడర్నిజం మీద ప్రేమ పెంచుకోవడం మనదగ్గర కూడ అనుభవమే. నేపాల్‌లో కూడ సామ్రాజ్యవాద సంస్కృతి, భావజాలాల ప్రభావంలో ఉన్న మేధావులు గత ఒకటి రెండు దశబ్దాలుగా పోస్ట్‌ మాడర్నిజం గురించిమాట్లాడుతుండగా , ప్రస్తుతం ప్రచండ అనుకూల శక్తులు కూడ పరోక్షంగా ఆ వాదనలవైపు పయనిస్తున్నాయి. అందువల్ల ఈ చర్చ ఏరాపటయింది. కిరణ్‌ నాయకత్వంలోని మావోయిస్టు పార్టీ సమర్థకుల వేదికగా ఈ చర్చావేదిక తయారయినప్పటికీ, వారు విశాల దృక్పధంతో అందనినీ ఈ చర్చకు ఆహ్వానించారు. ప్రచండ అనుకూల నాయకులు కూడ తగినంత మంది పాల్గొన్నారు. త్రిభువన్‌ విశ్వవిద్యాలయంలో నేపాలీ ప్రొఫెసర్‌ తారాకాంత్‌ పాండే నేపాలీలో పత్రాన్ని సమర్పించగా, భారత్‌నుంచి నూఢిల్లీ జవహార్‌లాల్‌ నెహ్రు విశ్వవిద్యాలయ హిందీ శాఖ మాజీ ప్రోఫెసర్‌, సాహిత్య విమర్శకుడు మేనేజర్‌ పాండే ఒక పత్రం, నేను ఒక పత్రం సమర్పించాం.
– ఎస్‌ వేణుగోపాల్‌
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో…