రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు

(శుక్రవారం తరువాయి భాగం)
ఈ మూడు పత్రాల మీద వ్యాఖ్యానించడానికి నలుగురు బిన్న భిన్న దృక్పధాల విమర్శకులను ఎంచుకున్నారు. మయన సిపిఐ, సిపిఎంల వంటి యునైటెడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ పార్టీ సానుభూ తిపరుడు, ప్రగతిశీల లేఖక్‌ సంఘ్‌ అధ్యక్షుడు అమర్‌గిరి పోస్ట్‌ మాడర్నిజాన్ని విమర్శిస్తూనే మావోయిజాన్ని కూడా విమర్శించారు. మనదగ్గదరి లాగే ‘ఉగ్రవాదమావోవాదం’ అని చాలా సార్లు అన్నాడు. త్రిభువన్‌ విశ్వవిద్యాలయ మాజీ ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌, పోస్ట్‌ మాడరినస్టు సమర్ధకుడు ప్రొఫెసర్‌ అభిసుబేది పోస్ట్‌ మాడర్నిం జంలో ఎటువంటి అత్యాధునిక లక్షనాలున్నాయో, వాటిని అర్థం చేసుకోవడంలో పత్ర సమర్పకులం ముగ్గురమూ ఎలా పొరపడ్డామో చెప్పాడు. ఇక ప్రపంచ అనుకూల మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సాహిత్యవిమర్శకుడు, నీను చావగాయ్‌: విప్లవం ఎవరి సొంత ఆస్తీకాదని, తామే నిజమైన మావోయిస్టులమనీ, తామేమీ పోస్ట్‌ మాడర్నిజాన్ని సమర్ధించడం లేదని అన్నాడు. మరొక మాజీ ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌, విప్లవ మావొయిస్టు పార్టీ సానుభూతిపరుడు దిల్‌సాహ్నీ పోస్ట్‌ మాడన్నిజం ప్రమాదాల గురించి మాట్లాడాడు, చిట్టచివరిగా యావోయిస్టు పార్టీ అధ్యక్షుడు , స్వయంగా చైతన్య పేరుతో ప్రఖ్యాతుడైన సాహిత్య విమర్శకుడు మోహన్‌బైద్య కిరణ్‌ వాదనలను, పత్రాలను స్పృశిస్తూ ఉపన్యసించారు.ఈ మూడు రోజు ల నేపాల్‌ అనుభవం కనీసం నాలుగు అంశాలలో నా మనసుమీద చెరగని ముద్ర వేసింది. మొట్టమొదటిది, నేపాల్‌కూ తెలంగాణకూ పోలిక సరిగ్గా 1946-51 మధ్య తెలంగాణలో జరిగినట్టే నేపాల్‌లోనూ 1995-2005 మధ్య రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. సరిగ్గా తెలంగాణలో జరిగినట్టే నేపాల్‌లోనూ నాయ కత్వం సాయుధపోరాట విరమణ ప్రకటించి ఎన&ఇనకల రాజకీ యాల్లోకి దిగింది. సరిగ్గా తెలంగాణలో లాగానే నేపనాలక్షోలో కూడ సాయుధ పోరాటం జరిగినప్పుడు భూస్వామ్య రాచరిక పాలన ఉండింది. సాయుధపోరాటాల ఫలితాలలో ఒకటిగా అక్కడ కూడ రాచరికం కూలిపోయింది. ఇక్కడి నాయకత్వమూ అక్కడి నాయక త్వమూ కూడ అదే గొప్ప విజయంగా, తమ లక్ష్యసాధనగా చెప్పుకు న్నారు. కాని స్పష్టంగానే రెండు చోట్లా ఉద్యమ క్రమంలో అంతకన్న ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుని, వాటిలో సగమో పావో కూడ తీరకుండానే ఉద్యమం ముగించారు. అయితే ఒక తేడా ఏమంటే తెలంగాణలో 1951 విరమణ తర్వాత పదిహేను సంవత్సరాల సుదీర్ఘమౌనం కొనసాగింది. నక్సల్బరీ నిప్పురవ్వ తర్వాత గాని పునర్నిర్మాణం సాధ్యంవ కాలేదు. నేపాల్‌లో పునర్నిర్మాణం నాలుగైదేళ్లలోనే మొదలయింది. నాయకత్వ విద్రోహం వల్ల ఆ నాయకులే కొంతకాలం అధికారంలో ఉండవం వల్ల అక్కడ పునర్నిర్మాణ ప్రయత్నాలు కష్టసాధ్యంగా ఉన్నాయి.
రెండో అంశం పెరిగిపోతున్న వస్తు వ్యామోహ సంస్కృతి నేపాల్‌ మీద ప్రపంచీకరణ ప్రభావాలు చాల ఎక్కువగా ఉన్నాయి. ఆ దేశ ఆర్థిక దుస్థితి వల్ల అక్కడి నుంచి విపరీతంగా వలసలు సాగుతుం టాయి. హిమాలయాల వల్ల విపరీతంగా పర్యాటకుల తాకిడి ఉంటు ంది. విదేశి ప్రభావాలు దేశంలోకి సులభంగా, చాల ఎక్కువ గా వస్తుంటాయి, ఖాట్మండూలో ఎన్నో మాల్‌లు, సామ్రాజ్యవాద సంస్కృతీ చిహ్నాలు వస్తున్యామోహం విచ్చలవిడిగా కనబడ్డాయి. ఈ ప్రభావానికి లోనైనా వేలాది మంది యువకులు కనబడ్డారు.
కాని అదే సమయంలో గొప్ప ఆశాసూచికలుగా రెండు అంశాలు కనబడ్డాయి. మొదటిది, అక్కడి విప్లవ, సాంస్కృతికోద్యమంలో కనబ డిన విశాల దృష్టి రివిజనిజాన్ని అంత తీవ్రంగా ఖండిస్తూ కూడ, ఆ రివిజనిస్టులతో ఒకే ప్రజా సంఘంలో ఉండడానికి, వారిని తమ వేదికల మీద మాట్లాడించడానికి, బహిరంగ చర్చలు జరపడానికి నేపాల్‌ విప్లవకారుల చూపుతున్న సంయమనం ఆహ్వాతనించ దగినది. సాయుధపోరాట వ్యూహాన్ని కొనసాగించడానికి పార్టీని చీల్చినవారే, సాంస్కృతిని, మేధో చర్చలో అటువంటి చీలికలు అవసరం లేదని అనుకుంటున్నట్టున్నారు. భావసంఘర్షణ బహిరం గంగా, ఐక్యంగా జరపవచ్చుననుకుంటున్నారు.
అంతకన్న ఎక్కువ ఆశను కల్పించినది, మొదటిరోజు కవితా ఉత్సవంలోను, మర్నాడు సదస్సులోను వందలాది మంది యువకులు పాల్గొనడం, రెండు రోజులూ సభికులలో సగంకన్న ఎక్కువ మంది ఇరవైలలో ఉన్న యువకులే ఉన్నారు. కవితా ఉత్సవంలో నేను విని అర్థం చేసుకోగలిగిన కవితలన్నీ కూడ ప్రచండ విద్రోహాన్న ఖండిస్తూ పోరాటం కొనసాగించవలసిన అవసరాన్ని వివరిస్తూ సాగాయి. సామ్రాజ్యవాద సంస్కృతిని విమర్శంచాయి. కవుల స్వరాలలో, హావభావాలలో గొప్ప విప్లవ స్పూర్తి కనబడింది, వినబడింది.
‘మార్క్సిజం లెనినిజం మావోయిజం ప్రచండ మార్గం’ అనీ, ‘ఇరవై ఒకటో శతాబ్ది సోషలిస్టు విపలవాలన్నిటికీ మార్గదర్శి ప్రచండ మార్గమే’ అనీ అతివాద నినాదాలు వినిపించిన నేల అది. ఆ నినాదాలు ఇంకా ప్రతిధ్వనిస్తుండగానే, ప్రచండ రంగు మార్చకుం డానే దిక్కు మార్చిన తర్వాత, విప్లవస్పూర్తిని యధాతధంగా నిలుపుకోవడం అసిధారావ్రతమే. ఆ అసిధారా వ్రతానికి నేపాలీ సోదరులు మరోసారి పూనుకుంటున్నారనే విశ్వాసంతో,వ ఆరు ఈ సారి జాగరూకతతో విజయం సాధించగలరనే ఆశతో తిరిగి వచ్చాను.
– ఎస్‌ వేణుగోపాల్‌
వీక్షణం సౌజన్యంతో