రెండో రోజు డిపోల్లోనేబస్సులు
– ఆందోళనలను ఉదృతం చేసిన కార్మికులు
– డీపోల వద్ద 144 సెక్షన్
హైదరాబద్/విజయవాడ,మే7(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. డిపోల్లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. పలుచోట్ల కార్మికులు ప్రత్యక్ష ఆందోళనలకు దిగారు.ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో డిపోల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయవాడ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ సమ్మెతో హైదారబాద్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్ల సాధనకై ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె గురువారానికి రెండో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. ఒకవైపు ఎంట్రెన్స్ పరీక్షలు, మరో వైపు పెద్ద ఎత్తున జరుగుతున్న పెళ్లిళ్లతో సాధారణం కంటే రద్దీ పెరిగింది. ప్రయాణికుల ఇబ్బందులను కొంతమేరకైనా తగ్గించేందుకు ఆర్టీసీ చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో తాత్కలిక నియామకాలపై డ్రైవర్లను, కండక్టర్లను తీసుకుంది. ఇలా అరకొరగా ఉన్న సిబ్బందితోనే కొన్ని బస్సులనైనా నడిపించేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తుంది. ఈ చర్యలను కార్మికులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.
ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో రైళ్లు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లన్నీ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుండగా అడ్డుకునేందుకు కార్మికులు యత్నిస్తున్నారు. పోలీసు బందోబస్తుతో పలు జిల్లాల్లో బస్సులు నడుపుతున్నారు. ప్రకాశం జిల్లాలో 6, ఖమ్మం జిల్లాలో 20 బస్సులు నడుపుతున్నారు. ముందస్తు చర్యగా అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు. తమ డిమాండ్ల సాధనకై ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె రెండో రోజుకు పలు చోట్ల ఉద్రిక్తతకు దారి తీస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికుల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. హైదరాబాద్ హకీంపేట బస్‌డిపో వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి హరీశ్‌రావును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉప్పల్ డిపోలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకవైపు ఎంట్రెన్స్ పరీక్షలు, మరో వైపు పెద్ద ఎత్తున జరుగుతున్న పెళ్లిళ్లతో సాధారణం కంటే రద్దీ పెరిగింది. ప్రయాణికుల ఇబ్బందులను కొంతమేరకైనా తగ్గించేందుకు ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టింది. ఈ క్రమంలో తాత్కలిక నియామకాలపై డ్రైవర్లను, కండక్టర్లను తీసుకొని కొన్ని బస్సులనైనా నడిపించేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తుంది. ఈ చర్యలను కార్మికులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంతో పాటు, 274 సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు బుధవారం ఉదయం నుంచి సమ్మె చేపట్టారు.
పలుచోట్ల కార్మికుల విధ్వంసం
నిజామాద్‌లో ప్రైవేట్ బస్సులను నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లపై యూనియన్ నాయకులు దాడికి పాల్పడ్డారు. కామారెడ్డి బస్టాండులో బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. డిపోల వద్ద బైఠాయించి ధర్నా చేపట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులపై లాఠీఛార్జ్ చేశారు. పలువురు కార్మిక సంఘ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో పోలీసుల బందోబస్తు మధ్యన అధికారులు బస్సులు నడుపుతున్నారు. అడ్డుకునేందుకు యత్నించిన కార్మికులను అరెస్టు చేశారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పాతబస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకునేందుకు యత్నించిన 10 మంది కార్మికులు అరెస్టు. అదేవిధంగా నగరంలోని వనస్థలిపురం, హెసీయూ తదితర డిపోల వద్ద కార్మికులు ప్రైవేట్ ఆపరేటర్లను అడ్డుకుంటున్నారు.తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా కార్మికులు విధులు బహిష్కరించి.. ఆందోళనకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. సమ్మెతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసు బందోబస్తు సహాయంతో బస్సులు నడపాలని తెలంగాణ సర్కారు.. అధికారులను ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలు జిల్లాల్లో బస్సులను డిపోల నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. చాలుచోట్ల ఇరువురి వర్గాల మధ్య వాగ్వాదం చేటుచేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంది.