రెపోరేటు తగ్గింపు

2

– ద్రవ్యపరపతిని సమీక్షించిన ఆర్‌బీఐ

ముంబయి,ఏప్రిల్‌ 5(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్యపరపతి విధాన సవిూక్ష వివరాలను ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడించారు. కీలక వడ్డీరేట్లను తగ్గించినట్లు చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని, రివర్స్‌ రెపో రేటును పావుశాతం పెంచినట్లు వివరించారు. రెపోరేటును ఆర్‌బీఐ 6.75 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించింది. ఎంఎస్‌ఎఫ్‌ రేటును ఆర్‌బీఐ 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. 2016-17లో వృద్ధిరేటు 7.6శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేసింది. సీఆర్‌ఆర్‌ రోజువారీ కనీస నిర్వహణను 95శాతం నుంచి 90శాతానికి తగ్గించినట్లు రాజన్‌ వెల్లడించారు. దీంతో రుణాల వడ్డీరేట్టు భారీగా తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నారు. వామన, గృహరుణాలు తగ్గుతాయని అంటున్నారు. ఈ లాభాలను వినియోగదారులకు చేరేలా చూడాలని రఘురామరాజన్‌ కోరారు. ఇదిలావుంటే పనామా పేపర్స్‌ వెల్లడించిన భారతీయుల జాబితాపై ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రంజన్‌ స్పందించారు. విదేశాల్లో బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండడం తప్పేవిూ కాదన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్‌బీఐ నియమావళి ప్రకారం కొన్ని విదేశీ వెంచర్లలో పెట్టుబడులు పెట్టుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అలాంటి కేసులను ఆర్‌బీఐ విచారిస్తుందన్నారు. చట్టపరమైన వెసలుబాటుతోనే విదేశీ అకౌంట్లను తీసుకోవచ్చన్నారు. పన్ను ఎగవేసేందుకు కొందరు సంపన్నులు పనామాలో పెట్టుబడులు పెట్టినట్లు వచ్చిన వార్తాలపై ఆయన మాట్లాడారు. పనామా పేపర్స్‌ వెల్లడించిన జాబితాలో 500 మంది భారతీయుల ఉన్నారు. ఆర్‌బీఐ రెపో రేట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ రాజన్‌ విూడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో డబ్చు చెలామణి ఎక్కువగా జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ జరుగుతున్న బ్యాంకు లావాదేవీలపై విచారణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. బ్యాంకులకు చెల్లించాల్సిన బాకీలను ఎగ్గొట్టి వెళ్లిన విజయ్‌ మాల్యాపైన కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ స్పందించారు. విూడియా కథనాల ఆధారంగా మాల్యా అంశాన్ని దర్యాప్తు చేయలేమన్నారు. ఇకపోతే ఆర్బీఐ ప్రకటన అనంతరం స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో కొనసాగాయి. 180 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌, 50 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టీ ట్రేడ్‌ అయ్యాయి. రెపోరేటు 6.75 నుంచి 6.5 శాతానికి తగ్గించింది. బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.28,898గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,020గా ఉంది. కిలో వెండి ధర రూ.35,866గా ఉంది.