రేపు ఫ్రీడం రన్ విజయవంతం చేయాలి చందంపేట జెడ్పీటీసీ పవిత్ర

చందంపేట (జనం సాక్షి) ఆగస్టు 10
స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అందరికీ స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జరుపబోవు వజ్రోత్సవ వారోత్సవాలలో భాగంగా తేదీ 11.08.2022 నాడు ఉదయం 06.00 గంటలకు చందంపేట మండలం పోలేపల్లి స్టేజ్ నుంచి గాగిళ్ళపురం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఫ్రీడం రన్ విజయవంతం చేయాలని చందంపేట జెడ్పీటీసీ పవిత్ర    పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చందంపేట మండల ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విద్యార్థి విద్యార్థులు యువత పాల్గొనాలని కోరారు