రేసు క్లబ్బులను పీకేస్తా.. పేదలకు ఇండ్లు నిర్మిస్తా..

C

హైదరాబాద్‌లో లక్ష మంది పేదలకు ఇండ్ల పట్టాలు

ఇది అరుదైన ఘట్టం, అద్భుతం” అంటూ

సీఎంను పొగడ్తలతో ముంచెత్తిన మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి

హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరంలో రేసు క్లబ్బులను పీకేస్తానని వాటి స్థానంలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్‌రావు అన్నారు. పేదలకు పట్టాలు ఇవ్వడమే గాకుండా వారికి హావిూ ఇచ్చిన మేరకు డబుల్‌ బెడ్‌ ఇళ్లు కట్టించి ఇస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్‌ హావిూ ఇచ్చారు. ఇంతకన్నా మంచి పని మరోటి ఉండబోదన్నారు. పేదలకు గూడు కట్టించాలన్న తన తపన నెరవేరేలా చూస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయడం నిజంగా ఓ అరుదైన ఘట్టంగా సిఎం అభివర్ణించారు. ప్రభుత్వం వందకు వంద శాతం పేదల బాధలు తీర్చేందుకు సిద్ధంగా ఉందని, పేదల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రశేఖర్‌రావు అన్నారు. మల్కాజిగిరిలో పేదలకు భూమి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇవాళ తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జీవితంలో మంచి పనులు చేసే అవకాశం తక్కువ సందర్భాల్లో వస్తుందన్నారు. జీవో నెంబరు 58 కింద రెగ్యులరైజేషన్‌ ప్రకారం 1 లక్షా 25 వేల మందికి ఇవాళ రాష్ట్రంలో భూమి పట్టాలు ఇస్తున్నామన్నారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే లక్ష మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.

జీవో 58 కింద 3 లక్షల 36 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇంకా రెండు లక్షల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వారు కూడా తమకు పట్టాలు రాలేదని చిన్నబోవద్దన్నారు. కొన్ని భూములు కోర్టులో కేసుల్లో ఉన్నాయని కేసులు క్లియర్‌ కాగానే మిగతా వారికి కూడా పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. జంట నగరాల్లో రెండున్నర లక్షల మంది పేదలు మురికివాడలు, గుడిసెల్లో జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పేరు విూద ఉన్న భూములను పేదలకు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇది జీవితంలో తనకో గొప్ప అనుభూతి అని అన్నారు. గతంలో పేదవాడు గుడిసె వేసుకుంటే వెంటనే పెద్ద పెద్ద అధికారులు బుల్‌ డోజర్లు వచ్చి కూల్చి వేసేవని గుర్తుచేశారు. ఇవాళ పేదల గోస తెలిసిన వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి ఎలాంటి ఆటంకంలేదన్నారు. హైదరాబాద్‌ను గుడిసెలు లేని నగరంగా మార్చుతామని తెలిపారు. రాబోయే రెండేళ్లలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించి ఇస్తామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రభుత్వమే పూర్తిగా ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తుందని తెలిపారు. లబ్దిదారులు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదన్నారు. గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన వ్యక్తి తన ఫ్యాక్టరీ కోసం పేదల భూమిని కబ్జా చేశారని మండిపడ్డారు. లంచాలకు తావులేకుండా తమ

ప్రభుత్వం ఇంటింటికి వచ్చి పట్టాలు ఇస్తుందని తెలిపారు. పేదలు బాగుపడ్డపుడే వచ్చిన తెలంగాణ రాష్ట్రం సార్థకమవుతుందని పేర్కొన్నారు.

జీవో నెంబరు 58 కింద రెగ్యులరైజేషన్‌ ప్రకారం 1 లక్షా 25 వేల మందికి ఇవాళ రాష్ట్రంలో భూమి పట్టాలు ఇస్తున్నామన్నారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే లక్ష మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. జీవో 58 కింద  రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 36 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇంకా రెండు లక్షల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వారు కూడా తమకు పట్టాలు రాలేదని చిన్నబోవద్దన్నారు.  పేదలు ఇళ్ళు నిర్మించుకొన్న కొన్ని భూములు కోర్టులో కేసుల్లో ఉన్నాయని కేసులు క్లియర్‌ కాగానే మిగతా వారికి కూడా పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు.జంట నగరాల్లో రెండున్నర లక్షల మంది స్లమ్‌లు, గుడిసెల్లో జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పేరు విూద ఉన్న భూములను పేదలకు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇది జీవితంలో తనకో గొప్ప అనుభూతి అని అన్నారు. గతంలో పేదవాడు గుడిసె వేసుకుంటే వెంటనే పెద్ద పెద్ద అధికారులు బుల్‌ డోజర్లు వచ్చి కూల్చి వేసేవని గుర్తుచేశారు. ఇవాళ పేదల గోస తెలిసిన వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి ఎలాంటి ఆటంకంలేదన్నారు. హైదరాబాద్‌ను గుడిసెలు లేని నగరంగా మార్చుతామని తెలిపారు. జంట నగరాల్లో దాదాపు  2 లక్షల మంది అధ్వాన్నంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  పేదలకు పైసా ఖర్చు లేకుండా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హావిూయిచ్చారు.

మరోవైపు మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. పట్టాల పంపిణీతో రాష్ట్రంలో ఇవాళ పండగ వాతావరణం నెలకొందన్నారు. మల్కాజిగిరిలో పేద ప్రజలకు భూమి పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు మల్లారెడ్డి పాల్గొన్నారు. సీఎంను మల్లారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. రాష్టాన్న్రి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిదని, రాష్టాభ్రివృద్ధిలో సీఎం కేసీఆర్‌కు అందరం అండగా నిలబడదామని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ లాంటి వ్యక్తి మనకు సీఎంగా దొరకడం అదృష్టమే గాకుండా కేసీఆర్‌ లాంటి సీఎంను తానెక్కడా చూడలేదన్నారు. మల్కాజిగిరి ప్రాంతానికి సీఎం వందల కోట్లు కేటాయించి ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేశారన్నారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,300 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పేదల బాధలు భాష తెలిసిన వ్యక్తి, పేదల పక్షపాతి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు.  మల్కాజిగిరిలో పేదలకు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎంతోపాటు పాల్గొని ప్రసంగించారు. సత్తా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని శ్లాఘించారు. గత పాలకులు పేదోడి భూమిని కూడా కబ్జా చేశారని గుర్తు చేశారు. వృధ్దాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హావిూని నిలబెట్టుకున్న ఘనత కేసీఆర్‌దేనని వెల్లడించారు. పేదల జీవితంలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు.