రైతులకు ఉపయోగపడతాయంటే సర్పంచ్ కి ఇచ్చినాం !

వ్యవసాయ అధికారి కొత్త లాజిక్కు

రెండు లక్షల విలువైన ఎరువులు ఎవరి ఖాతాలోకి పోయినట్టు.

 

 

చందుర్తి(జనం సాక్షి): ఎక్కడైనా అక్రమంగా ఎరువులు నిల్వ ఉంచారని తెలిస్తే, తెలిసిన అధికారులు తనిఖీలు చేసి రసీదులు లేకపోతే సీజ్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం అప్పగించడము చేస్తుంటారు. సుమారు రెండు లక్షల విలువైన ఎరువులను ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా నిలువ ఉంచారని స్వాధీనం చేసుకున్న మండల వ్యవసాయ అధికారులు సర్పంచి రైతులకు ఉపయోగపడతాయని చెబితే సర్పంచ్ కి ఎరువులను అప్పగించి కొత్త లాజిక్కుకు తెర తీశారు. ఆఖరుకు రెండు లక్షల విలువైన ఎరువులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయని మాత్రం తేలకుండానే మిగిలింది. .ఇటీవల లైసెన్స్ లేకుండా నిల్వ ఉంచిన ఎరువులు పట్టుకొని గ్రామ సర్పంచ్ కి అప్పజెప్పిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మండలంలోని కిష్టంపేట గ్రామంలో శ్రీనివాస్ దాదాపు రెండు సంవత్సరాల నుండి పర్టిలైజెర్ దుకాణం నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో అనుమతులు లేకుండా ఎరువుల నిల్వ చేశారన్న సమాచారంతో మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి తనిఖీ చేసి శ్రీనివాస్ వద్ద నుండి సుమారు రెండు లక్షల విలువైన ఎరువుల స్వాధీనం చేసుకున్నారు.అయితే స్వాధీనం చేసుకున్న ఎరువు మందులను సీజ్ చేయడమో ఆ పరిధిలో ఉన్న విధంగా చర్యలు తీసుకోవడం చేయాలి. కానీ ఇక్కడ సంబంధిత అధికారి ఇవేమీ చేయకుండా గ్రామంలోని ఓ వ్యక్తికి అప్పగించి రైతులకు అమ్మెందుకు లోపయకరిగా ఒప్పందం కుదుర్చుకుందనీ ప్రచారం జరుగుతుంది. దుకాణ యజమాని పెర్టిలైజెర్ ఎరువులను పూర్తిగా వదులుకుంటే కేసు లేకుండా చేస్తానని సంబంధిత అధికారి బెదిరించడంతో ఎరువులను సదరు అధికారికి అప్పగించినట్లు తెలుపుతున్నాడు.. మొత్తంగా రెండు లక్షల విలువైన ఎరువులను సీజ్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ఏమిటనీ మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో సదరు అధికారి రైతులకు ఉపయోగపడేందుకే ఎరువులను సర్పంచ్ కి అప్పగించామని తెలుపడంతో పాటు తాను పిల్డ్ పై ఉన్నాననీ వివరాలు కార్యాలయంలో ఉన్నాయని జారుకోడం కొసమెరుపు.

 

_ మహేశ్వరి

మండల వ్యవసాయ అధికారి.

ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో తనిఖీలు చేసినాం. ఇంట్లో ఉన్న ఎరువులతో తనకు సంబంధం లేదని దుకాణం యజమాని తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకున్నము. రైతులకు ఉపయోగపడతాయని తెలపడంతో సర్పంచ్ కు అప్పగించడం జరిగింది.