రైతు ఆత్మహత్యలను తీవ్రంగా పరిగణించాలి

3

– ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి):రైతుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ పిలుపునిచ్చారు. రైతుల ఆత్మహత్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ లోని ఆర్టీసీ కళాభవన్‌ లో అఖిల భారత కిసాన్‌ మహాసభలను అన్సారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనను సన్మానించారు.స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే దిగుబడులను పెంచేందుకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకున్నాయని అన్సారీ గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే వరిని ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇండియా నెంబర్‌ వన్‌ గా ఉందన్నారు. ఆయిల్‌ సీడ్స్‌, పల్సెస్‌ ఉత్పత్తిలో ఇప్పటికీ దేశం అగ్రస్థానంలో ఉందని వివరించారు.

‘స్వాతంత్రోద్యమంలో మహిళలది కీలక పాత్ర

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ మహిళా ప్రజా ప్రతినిధుల సమావేశం జరుగుతోంది జరిగింది.ఈ సమావేశంలో హవిూద్‌ అన్సారీ ప్రసంగిస్తూ… దేశ స్వాతంత్ర పోరాటంలో మహిళలు పోషించిన పాత్రను గుర్తు చేశారు. పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహిళలకు రాజకీయ రంగంలోనూ సమ ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. అలాంటపుడే దేశ ఆర్థిక ప్రగతి సాధ్యపడుతుందని తెలిపారు.కాగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ ఢిల్లీలో జరిగిన జాతీయ మహిళా ప్రజా ప్రతినిధుల సదస్సులో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధిపై చర్చ జరగడం శుభపరిణామని వ్యాఖ్యానించారు. మహిళల అభివృద్ధి కోసం కేంద్రం బేటీ బచావో, బేటీ పడావో పథకాలను అందజేస్తోందని పేర్కొన్నారు. పార్లమెంటరీ కమిటీల్లో మహిళలకు ప్రాతినిధ్యం లేదనేది వాస్తవమని తెలిపారు. భవిష్యత్‌లో ఈ కమిటీల్లో మహిళలకు ప్రాతినిథ్యం ఉంటుందని భావిస్తున్నానన్నారుఇదే విషయాన్‌ఇన తనప్రసంగం ద్వారా రాష్ట్రపతి వెల్లడించారని అన్నారు. మహిళలు ఎంతగా చదువుకుని ముందుకు వస్తే అంతమంచిదన్నారు.