*రైతు వేదిక కమిటీ సభ్యులకు సన్మానం*
మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 22
జనం సాక్షి
కోరుట్ల నియోజకవర్గం రైతు వేదిక కమిటీ( రెబల్ )కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఆదేశాల మేరకు, ఆయన నివాసం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో రైతు వేదిక కమిటీ (రెబల్) సభ్యులతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ రైతు వేదిక రెబల్ అధ్యక్షులు అల్లూరి లింగారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు దిక్కు మొక్కు లేకుండా పోయిందని, ఈరోజు రైతులు పండించిన ధాన్యాన్ని అమ్మపోతే అడవి, కొనబోతే కొరివిలా, మారిందని ఆగ్రహించారు. సర్కారు కొలువులు చేసే ఉద్యోగులకు జీతాల మీద జీతాలు పెరుగుతుంటాయని, కానీ ఇక్కడ ఆరుగాలము కష్టించి పండించిన పంటలకు మద్దతు ధర లేక, నేడు అన్నదాత తినే అన్నంలో విషo కలుపుకొని చస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకే తలమానికమైన నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకుండా ప్రభుత్వము చెరుకు రైతులను మరింత ఆగం చేశారని మండిపడ్డారు. మూసివేసిన నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కొరకు నియోజవర్గం మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి రాములు జ్యోతక్క ఆధ్వర్యంలో సుదీర్ఘమైన రిలే నిరాహార దీక్షలు, నిరసనలు, పోరాటాలు, చేశామని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో చెరుకు రైతుల సమస్యను గుర్తించి రైతు డిక్లరేషన్ లో నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో తప్పకుండా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, జిల్లాలో మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే సత్తా, దమ్ము ,కోరుట్లకు కాబోయే ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములకే ఉందని అన్నారు. అనంతరం రైతు వేదిక రెబల్ కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు గౌరవ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తూ.. నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేలా ప్రభుత్వానికి కనులు తెరిపించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రైతు వేదిక రెబల్ కమిటీ సభ్యులు గడ్డం నరేష్ రెడ్డి, అంబటి హనుమాన్లు, గోపనవేని నారాయణ, సింగని మారుతి, అల్లూరి గంగారెడ్డి, నీలి చెట్టిరెడ్డి, బత్తుల ప్రసాద్, బర్లా అంజయ్య, బత్తుల నరసయ్య, లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రోళ్ల హనుమాన్లు, యామ రాజయ్య, న్యాయవాది సురభి అశోక్, ఎండి రైసోద్దీన్, పెంట ప్రణయ్, రెబస్ మహేష్ యాదవ్, బర్ల అర్జున్ పల్లికొండ ప్రవీణ్, రజాక్, బందిల కృష్ణమూర్తి, కంటి హరికుమార్, పిఎస్ రెడ్డి, పొట్ట గోపి, తాండ్ర నర్సయ్య, యమ నవీన్, సల్మాన్, తదితరులు పాల్గొన్నారు