రోడ్డును సవరించి డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి

రుద్రంగి సెప్టెంబర్ 10 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో అంతర్గత రోడ్లను సవరించిన అనంతరం డ్రైనేజీ పనులు చేపట్టాలని గ్రామంలోని 5,6 వ  వార్డుల సభ్యులు కోరుతున్నారు.రుద్రంగి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం నుండి పశువుల దవాఖాన వరకు డ్రైనేజీ పనులను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టగా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు.ముందుగా రోడ్డును సవరించి అనంతరం డ్రైనేజీ పనులు చేయాలని వారు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు.ఎంపీడీవో కార్యాలయానికి సమీపంలో గల అంగన్వాడి కేంద్రం యొక్క ప్రహరీ గోడ గతంలో రోడ్డును ఆక్రమించి నిర్మించారని, ఆక్రమించిన భూమిని వెలికి తీసిన అనంతరం డ్రైనేజీ పనులు చేపడితే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.అలాగే గతంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన చేతిపంపు బోరు సైతం అంగన్వాడి కేంద్రంలో ఆక్రమణకు గురైందని దాని ఆధారంగా స్థానిక ప్రజాప్రతినిధులు,పంచాయతీ కార్యదర్శి తదితరులు మోకా ఎంక్వయిరీ చేసి స్థానిక రోడ్డును వెలల్పు చేసిన అనంతరం డ్రైనేజీ చేపట్టాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంగళ కొమురయ్య గౌడ్,తోకల రమేష్,గాజ భూమయ్య,తోకలశంకర్,తోకల పెద్ద నర్సయ్య,దావల రవి,నర్సయ్య,రాజనర్సయ్య, రాజం,భాగ్య,లక్ష్మి,సతవ్వ,గౌరవ్వ,లక్ష్మి,బుచ్చిరాజు,శరత్ కుమార్,నరేష్,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.