రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గగాయాలు
ఎంజిఎం ఆస్పత్రికి తరలింపు
హన్మకొండ,ఆగస్ట్2(జనంసాక్షి): జిల్లాలోని ఎల్కతుర్తి మండలం సూరారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీజీ సెట్ పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థుల వాహనం అదుపుతప్పి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఎంజీఎంకు తరలించారు.మిగతా విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించి పోలీసు వాహనంలో పరీక్ష కేంద్రానికి తరలించారు. పెద్దపల్లి నుండి వరంగల్‌కు విద్యార్థులు వస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.