లండన్‌లో శాంతి శిఖరం

1

-బాపూజీ విగ్రహావిష్కరణ

లండన్‌,మార్చి14(జనంసాక్షి): ప్రపంచ రాజకీయ చరిత్రలో మహాత్మాగాంధీ ఓ శిఖరం లాంటివారని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అన్నారు. ఆయన మార్గం నేటి తరాలకు కూడా అనుసరణీయమన్నారు. లండన్‌లోని పార ్లమెంట్‌ స్క్వేర్‌ వద్ద గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనం తరం మాట్లాడుతూ మానవత్వంపై విశ్వాసం పోగొట్టుకోకూ డదని గాంధీ చెప్పేవారని, మానవత్వం ఓ సముద్రం వంటి దని ఆయన అనేవారని కామెరాన్‌ పేర్కొన్నారు. ప్రపం చంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఒకే వేదికవిూదికి రావడం ఆనందంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ ్‌జైట్లీ అన్నారు. భారత్‌నుంచి ఈ కార్యక్రమానికి అరుణ్‌జైట్లీ, అమితాబ్‌ బచ్చన్‌ హాజరయ్యారు. లండన్‌లోని పార్లమెంట్‌ స్క్వేర్‌ వద్ద భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ ఆవిష్కరించారు. భారత్‌ నుంచి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ బాపూ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. మహాత్మునికి గౌరవసూచకంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం పార్లమెంట్‌ స్క్వేర్‌ వద్ద ఏర్పాటైన తొలి భారతీయుని విగ్రహం అవుతుంది. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్ముడు దేశానికి స్వాతంత్య్రం తసీఉకుని వచ్చారు. ఇప్పుడు బ్రిటిష్‌ పాలకులకే మన జాతిపిత ఆదర్శం కావడం విశేషం.