లక్వీ విడుదల.. భారత్‌ నిరసన

5
న్యూఢిల్లీ,మార్చి13 (జనంసాక్షి):

ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్‌ లఖ్వీ విడుదల అంశంపై  పాకిస్థాన్‌ హైకమిష నర్‌ అబ్దుల్‌ బాసిత్‌కు భారత్‌ సమన్లు జారీ చ ేసింది. ఈ మేరకు భారత విదేశాంగకార్యదర్శి అ నిల్‌ వాద్వా సమన్లు పంపారు. ఈ విషయమై వా ద్వా విూడియాతో మాట్లాడుతూ లఖ్వీ బెయిల్‌ పొంది ఉండవచ్చు కానీ విచారణ కొనసా గుతుందని అన్నారు. ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు లఖ్వీ విడుదలకు  ఇస్లా మాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌ తీవ్రనిరసన వ్యక్తం  చే సింది. దీనిపై ఇస్లామాబాద్‌ తగిన చర్యలు తీసు కోవాలని కోరింది.ముంబై పేలుళ్ల ప్రధాన సూత్ర ధారి లఖ్వీని విడుదల చేయాలని ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశాలు

జారీచేసింది. లఖ్వీని ఇన్నాళ్లు నిర్భందంలో ఉంచడం అక్రమమని వ్యాఖ్యానించింది. 2008 నాటి ముంబై పేలుళ్ల కేసులో లఖ్వీ ప్రమేయం నిరూపించే ఆధారాలేవీ లేవని కోర్టు తేల్చింది. ఈ కారణంగా అతన్ని ఇంకా నిర్భందంలో ఉంచడం చట్ట విరుద్ధమని పేర్కొంది. అయితే లఖ్వీపై మరో మూడు కేసులు ఉన్నందున అతని విడుదల ఇప్పట్లో అసాధ్యమని తెలుస్తోంది. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా నాయకుడు రహమాన్‌ లఖ్వీ 2009 నుంచి రావల్పిండి జైల్లో బందీగా ఉన్నాడు. గత డిసెంబర్‌ నెలలో ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశాల మేరకు లఖ్వీని విడుదల చేశారు. అయితే తీవ్ర వ్యతిరేకతలు రావడంతో పాక్‌ ప్రభుత్వం వెంటనే అతన్ని మరో కేసులో నిర్భంధించింది. మరోవైపు ముంబై పేలుళ్ల నిందితుడు లఖ్వీని విడుదల చేయాలంటూ ఇస్తామాబాద్‌ హైకోర్టు ఆదేశాలివ్వడంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ముంబై దాడి కేసులో అతినికి వ్యతిరేకంగా ఆధారాలను కోర్టు ముందుంచడంలో పాక్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. లఖ్వీకి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలిసన బాధ్యత పాక్‌ ప్రభుత్వానిదేనని తెలిపింది. ఉగ్రవాదుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరని, ఆ విషయాన్ని పాక్‌ ప్రభుత్వం గుర్తించాలని భారత్‌ కోరింది. ఈ మేరకు భారత్‌లో పాక్‌ హై కమిషనర్‌ బాసిద్‌ వద్ద కేంద్రం తన అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన పాక్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని హావిూ ఇచ్చింది.