లక్ష ఇండ్లు మింగిన్రు
సర్పంచ్‌లు, స్థానిక నేతలు, తహశీల్దార్లు, మండలాధికారుల హస్తం
సీఐడీ నివేదికలో వెలుగుచూసిన బోగస్ ఇందిరమ్మ గృహాల బాగోతం
హైదరాబాద్,,మార్చి6(జనంసాక్షి): ఇందిరమ్మ ఇండ్ల అక్రమాలకు సంబంధించిన భయంకర వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. సీఐడీ విచారణ చేపట్టిన ఇండ్ల డేటాలో నాలుగింఠ ఒక వంతు అక్రమాలు జిరిగినట్లు నిర్థారించింది. దాదాపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాల్లో డొంక కదులుతోంది. ఇందులో జరిగిన అవినీతి, అక్రమాలపై సీఐడీ అధికారులు పురోగతి సాధించారు. సీఐడీ అధికారులు తమ విచారణలో ఇప్పటి వరకు 3 లక్షల 94 వేల ఇళ్లను పరిశీలించారు. వాటిలో లక్ష బోగస్ ఇండ్లు ఉన్నట్టు తేల్చారు. ఈ కుంభకోణంలో గ్రామ సర్పంచులు, తహశీల్దార్లు, మండల అధికారులు, స్థానిక నేతల హస్తం ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వ నిర్ణయం కోసం సీఐడీ అధికారులు వేచి చూస్తోన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.