వంటగ్యాస్‌ రాయితీ వదిలించుకున్నందుకు 100 కోట్లు ఆదా

5

ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ,మార్చి27(జనంసాక్షి): కొందరు ఉన్నత వర్గాలు  ఎల్పీజీ రాయితీ వదులుకోవడం వల్ల వందకోట్ల ఆదా అయ్యిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇది దేశ ఆర్థికాభివృద్దికి ఎంతగానో దోహదపడే చర్యని అన్నారు. రాయితీని వదులుకునే ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ దిల్లీలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అభివృద్ధికి ఇంధన రంగంలో స్వావలంబన అత్యవసరమని పేర్కొన్నారు. నగదు బదిలీతో వంటగ్యాస్‌ రాయితీలో లీకేజీని అరికట్టామని అన్నారు. కొందరు తమంత తాముగా ముందుకు వచ్చి  2.8లక్షల మంది ఎల్పీజీ రాయితీ వదులుకున్నారని ప్రధాని వివరించారు. ఎల్పీజీ రాయితీ వదులుకోవటం వల్ల రూ.100 కోట్లు ప్రజా ధనం ఆదా అయ్యిందన్నారు. మార్కెట్‌ ధరకు ఎల్పీజీ కొనే స్తోమత ఉన్నవాళ్లు రాయితీ వదులుకోవాలని కోరారు. నాలుగేళ్లలో కోటి కుటుంబాలకు పైపుల ద్వారా వంటగ్యాస్‌ కనెక్షన్‌ అందిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పటికే పలవురు కేంద్రమంత్రులు, మన రాష్ట్రంలో బిజెపి నాయకుడు కిసన్‌ రెడ్డి రాయితీని వదులుకున్నారు. తొలుత జైట్లీ ఈ ప్రకటన చేశారు.