వజ్రోత్సవాలను విజయవంతం చెయ్యాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు అయిలయ్య

 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
పెద్దవంగర సెప్టెంబర్ 14(జనం సాక్షి )16వ తారీకున పాలకుర్తిలో జరిగే తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య తెలిపారు.
బుధవారం ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్  శాఖ మంత్రి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈసమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు,కార్యకర్తలు, యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చి సమైక్యత ర్యాలీని మరియు మంత్రి  పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.  ఇట్టి సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పనులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును బహిరంగ సభలో వివరిస్తారని అన్నారు. తరువాత ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సీఎం రిలీఫ్ ఫండ్ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న పేదలకు వైద్య ఖర్చులను మంత్రి సహకారంతో ఇప్పించడం జరిగిందని తెలిపారు.ఈ సీఎం రిలీఫ్ ఫండ్  లబ్ధిదారులు పోచంపల్లి గ్రామానికి చెందిన ఝాన్సీరాణికి 45000,బొమ్మేరా శ్యామ్ సుందర్ కు 60000 ఉప్పరగూడెం గ్రామానికి చెందిన సొమ కమలాకర్ కు 60000 సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులు పంపిణి చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అతిధిలు గా  పాల్గొన్నారు రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్  కార్పొరేషన్ మాజీ చైర్మన్ ధరావత్ అభిమాన్ గాంధీ నాయక్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు  మారినేని వెంకన్న, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు జాటోత్ నెహ్రూ నాయక్,  మండల రైతు కోఆర్డినేటర్ పాకనాటి సోమారెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు పాలకుర్తి యాదగిరి రావు, మాజీ ఎఫ్ ఏ సి ఎస్ వైస్ చైర్మన్ ముత్తినేని శ్రీనివాస్, మండల పార్టీ ఉపాధ్యక్షులు భానోత్ వెంకన్న, జనగాం సత్యనారాయణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏదునూరి శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ ముజీబ్, మండల టిఆర్ఎస్ నాయకులు శ్రీరామ్ సుధీర్,మండల అధికార ప్రతినిధి బానోత్ సోమన్న,మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు చిలుక బిక్షపతి,ఎండీ శరబోద్దీన్, ధరవత్ రమేష్,ప్రధాన కార్యదర్శిలు దంతలపెల్లి ఉపేందర్, ధరవత్ బాలు, బానోత్ గోపాల్, సీనియర్ నాయకులు దుంపల సమ్మయ్య, మండల ప్రచార కార్యదర్శిలు పసులేటి వెంకట్రామయ్య,లింగాల రమేష్,మండల యూత్ నాయకులు కుకట్ల యాకన్నా, మైలపాక అనిల్, దేశెట్టి వెంకటేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీ లు, రైతు కోఆర్డినేటర్లు, పిఏ ఎస్ సి డైరెక్టర్లు, మాజీ సర్పంచ్లు, యూత్ నాయకులు,సోషల్ మీడియా నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు