*వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి*
*జయశంకర్ జిల్లా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు గుంజ స్వామి*
రేగొండ (జనం సాక్షి) : కడు పేదరికంలో మగ్గుతున్న వడ్డెర కులస్తులను ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గుంజ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేగొండ మండలం పెద్దపల్లి గ్రామంలో తెలంగాణ వడ్డెర సంఘం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు గుంజ స్వామి మాట్లాడుతూ తరతరాలుగా మట్టి పని చేస్తూ వడ్డెరలు దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డెరలకు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు భోదాసు రాజయ్య, బోదాసు రవి, శంకర్, కుమారస్వామి, సతీష్, గొల్లన మల్లేష్, గొల్లన సారంగం, రాజయ్య, రవి తదితరులు పాల్గొన్నారు