వరంగల్‌లో గ్రేటర్‌పై గులాబీ జెండా
– రోడ్‌షోలో కేటీఆర్
వరంగల్,మార్చి4(జనంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద పట్టణమైన వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్‌పై గులాభి జండా గుభాలించడం ఖాయమని రాష్ట్ర పురపాలన, పంచాయితీరాజ్, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. ఆయన గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌కు జరుగుతున్న ఎన్నికల చివరి రోజు ప్రచార కార్యక్రమాన్ని రోడ్‌షోతో నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంబించిన కేటీఆర్ రోడ్ షో కార్యక్రమం సాయంత్రంవరకు కొనసాగింది. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో వరంగల్ కార్పోరేషన్‌లో 1500 కోట్లను వెచ్చిస్తున్నామని మంత్రి తెలిపారు. వరంగల్ నగరాన్ని సుందర నగరంగానే కాక ప్రపంచంలోనే చారిత్రాత్మక సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇందుకోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ గల్లీ గల్లీని కూడా తిరిగి సమస్యలను తెలుసుకున్నారన్నారు. అందుకు అనుగుణంగానే అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగానా రాష్ట్రం ఏర్పాటయ్యాకనే హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో మద్యాహ్నభోజనం అందిస్తున్నామన్నారు. అలాగే గతంలో నిబందనల పేరుతో కేవలం 20 కిలోలకే పరిమితం చేసిన బియ్యాన్ని ఎత్తివేసి ప్రతి ఒక్కరికి నాలుగు కిలోలనుంచి ఆరు కిలోలకు పెంచామని, గృహంలో ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం ఇస్తున్నామన్నారు. దళిత, ముస్లిం, క్రిస్టియన్, గిరిజన కుటుంబాలకు చెందిన యువతుల వివాహానికి 51వేల రూపాయలను షాది ముభారక్, కళ్యాణ లక్ష్మి ద్వారా అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఫించన్లను 200 రూపాయలున్నదానిని వెయ్యికి, 500 ఉన్న వికలాంగుల ఫించన్లను 1500కు పెంచామన్నారు. ప్రస్తుతం 40లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అంతేకాక నగరంలోని స్లమ్ ఏరియాల్లో నివసించే వారికి డబుల్ బెడ్ రూం ఇల్లను నిర్మించి ఇవ్వబోతున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడూ కూడా వరంగల్ నగరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తుచేశారు. వరంగల్ పట్టణానికి ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చామని, సైనిక్ స్కూల్‌ను కూడా కేంద్రంనుంచి కేటాయింప చేశామని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా వరంగల్‌లోనే
ఏర్పాటుచేయనున్నామ న్నారు. వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి నగరంలోని జంక్షన్లను అభివృద్ది చేయనున్నామన్నారు. వరంగల్ నగరానికి అవసరమైన తాగునీటి సమస్యను తీర్చేందుకుగాను రిజర్వాయర్ ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఐటి పార్క్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం,పలు జంక్షన్ల అభివృద్ది చేసేందుకు నిర్ణయం తీసుకోవడమేకాక అమలు చేసే చర్యలు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు. త్వరలోనే నగరాన్ని ప్రపంచ సుందర నగరంగా తీర్చిదద్ది చూపిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కోన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. డివిజన్లలో టీఆర్‌ఎస్ పార్టీ కార్పోరేటర్లుంటే ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వాన్ని నేరుగా అడిగే హక్కు ఉంటుందన్నారు.అ దే పచ్చపార్టీ, ఎర్రపార్టి, త్రివర్ణ పార్టీలను గెలిపిస్తే ఎక్కడికి వెలతారు ఎలా పనులు అవుతాయో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. నిరుపేదలందరికి నయా పైసా ఖర్చులేకుండా డబుల్ బెడ్ రూం ఇల్లను నేరుగా లబ్దిదారుడి ఇంటిని మంజూరి చేయనున్నామన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా, అధికారి అయినా దళారి అయినా లంచం అడిగితే చెప్పు తీసుకుని తన్నండని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలకు కాలం చెల్లిపోయిందని, ఇకవారికి ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్ప అధికార బాట ఉండనే ఉండదన్నారు. గతంలో కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి ఓట్లెయించుకుని వెల్లిన పార్టీల నేతలు ఏ ఒక్కనాడైనా ప్రజల ముంగిటికి వచ్చి బాగోగులు చూశారా అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. వారికి అధికారం తప్ప ప్రజాసంక్షేమంగాని, సేవగాని అవసరంలేదన్నారు. కేవలండబ్బులు దండుకోవడమే లక్ష్యంగా 67 ఏళ్లపాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పనిచేశాయన్నారు. ప్రతిపక్షాలు కేవలం శిఖండి రాజకీయాలు చేస్తున్నాయని, టీఆర్‌ఎస్‌ను ఓంటరిగా ఎదురుకునేదమ్ములేకనే లేనిపోని విమర్శలకు తావిస్తున్నారన్నారు. ఆయన వెంట డివిజన్ల అభ్యర్థులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, పొన్నాల తదితరులు ప్రచారం చేశారు. టిడిపి నుంచి రేవంత్,రమణ, రేవూరి తదితరులు ఉధృతంగా ప్రచారం చేశారు. దీంతో గ్రేటర్ పరిధిలో డివిజన్లన్నీ ఆయా పార్టీల కార్యకర్తలతో కిటకిటలాడాయి. ముఖ్యనేతలు అభ్యర్థుల్ని వెంట తీసుకెళ్లి తమ పార్టీ గుర్తులు చూపిస్తూ ఓట్లను అభ్యర్థించారు. వీలైనన్ని ఎక్కువ డివిజన్లు తిరిగి ఇంటింటా ఓటర్లని కలిసే ప్రయత్నాలు చేశారు. విజయమే లక్ష్యం అంటూ బరిలో దిగిన తెరాస శ్రేణులు గురువారం విస్తృతస్థాయిలో ప్రచారం చేశాయి. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా డివిజన్లలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి ఈటల రాజేందర్ ,¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా పలు డివిజన్లలో ప్రచారం చేశారు. అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. ఇతర పార్టీలకు ఓటు వేస్తే మురికికాలువలో వేసినట్లేనని తెలిపారు. భాజపా తెలంగాణకు అన్యాయం చేస్తోందని, గ్రేటర్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మొత్తంగా వరంగల్ ఎన్నిక ప్రచారం వేడెక్కి ముగిసింది. అన్ని పరా/-టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. 6న జరిగే ఎన్నికలల్లో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.