వరంగల్ సరిహద్దుల్లో పోలీస్ కాల్పులు
వికారుద్దీన్ సహా నలుగురు హతం
వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఘటన
ఎస్కార్ట్ ఆయుధాలను లాక్కునే ప్రయత్నం
తేరుకొని కాల్పులు జరిపారు
ఘటనా స్థలంలో ఉన్నతాధికారులు
వరంగల్/నల్లగొండ,ఏప్రిల్7
(జనంసాక్షి):
సూర్యాపేట కాల్పుల ఘటనకు బాధ్యులైన ఇద్దరు సిమి ఉగ్రవా దులు పోలీసు కాల్పుల్లో హతమె ౖన ఘటన సద్దుమణగకముందే వరంగల్ జిల్లాలో కరుడుగట్టిన ఐదుగురు ఐఎస్‌ఐ ఏజెంట్లు పోలీసు కాల్పుల్లో హతమయ్యా రు. వరంగల్ జిల్లా పెంబర్తి, నల్లగొండ జిల్లా ఆలేరు మధ్య ఉగ్రవాది వికారుద్దీన్ సహా మరో నలుగురు ఉగ్రవాదులు హతమ య్యారు. కోర్టుకు హాజరుపరిచేం దుకు కోసం భారీ సెక్యూరిటీతో వీరిని వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తీసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. వరంగల్, నల్లగొండ సరిహద్దుల్లోకి ఎస్కార్ట్ వాహనం ప్రవేశించగానే వికా రుద్దీన్ తదితరులు కాలకృత్యాలు తీర్చుకునే నెపంతో పారిపోయే ప్రయత్నం చేశారని, పోలీసులపై తిరగబడి వారి నుంచి ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారని, పోలీసులుపై తిరగబడి వారివద్దనున్న తుపా కులను లాక్కుని కాల్చే ప్రయత్నం చేశారని, దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు హతమయ్యారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గతంలో ఐఎస్ సదన్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో వికారుద్దీన్ గ్యాంగ్ వరంగల్ సెంట్రల్ జైలులో ఉంటోంది. మంగళవారం నాంపల్లి కోర్టులో వీరిని హాజరు పరిచేందుకు వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జనగామ – ఆలేరు మధ్య వీరిని తరలిస్తున్న వాహనాన్ని ఎస్కార్ట్ పోలీసులు ఆపారు. అంతలోనే వికారుద్దీన్ గ్యాంగ్ పోలీసుల వద్ద ఉన్న తుపాకులను లాక్కొని పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వికారుద్దీన్ గ్యాంగ్‌పై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో వికారుద్దీన్ గ్యాంగ్ హతమైంది. మృతుల్లో వికారుద్దీన్‌తో సహా సయ్యద్ అంజాద్, మహ్మద్ అనీఫ్, మహ్మద్ జకీర్, ఇజార్‌ఖాన్ ఉన్నారు. వరంగల్ జిల్లా పెంబర్తి, నల్లగొండ జిల్లా ఆలేరు మధ్య జాతీయ రహదారిపై ఈ పోలీసు కాల్పులు జరిగాయి. ఇందులో జైలు నుంచి తీసుకుని వస్తున్న ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల కాల్పుల్లో మరణించిన వికారుద్దీన్ సహా ఐదుగురికి సిమి తీవ్రవాద కార్యక్రమాలతో సంబంధం వుంది. వాహనం ఆలేరు దాటుతున్న సమయంలో వికారుద్దీన్ మూత్రవిసర్జన వస్తుందనడంతో పక్కనే ఉన్న పంట పొలాల వద్ద నిలిపారు. ఇదే అదునుగా వాహనంలో ఉన్న మరో ఉగ్రవాది కానిస్టేబుల్ నుంచి ఆయుధాన్ని లాక్కుని కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న సిమి కార్యకర్తపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన నలుగురు పారిపోయే ప్రయత్నం చేయడంతో లొంగిపోవాల్సిందిగా పోలీసులు కోరారు. అయినప్పటికీ వారు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వికారుద్దీన్ సహా ఐదుగురు సిమి కార్యకర్తలను పోలీసులు మట్టుబెట్టారు. ఉగ్రవాది కాల్పుల్లో స్వల్పంగా గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం భువనగిరికి తరలించారు.
కరుడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్
కరుడగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌కు సుదీర్ఘమైన నేర చరిత్ర ఉంది. ఎన్నో సంఘటనల్లో ప్రత్యక్ష నేరస్థుడు అతను. 2009లో సంతోష్‌నగర్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపాడు. మూడుసార్లు పోలీసులపై దాడికి దిగి ఇద్దరు పోలీసులను పొట్టన పెట్టుకున్నాడు. గతంలో సివిూలో క్రీయాశీలకంగా పనిచేసిన వికారుద్దీన్ డీజేఎస్ పేరుతో హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించాడు. గత కొన్నేళ్లుగా జైల్లో ఉన్న వికారుద్దీన్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. నాలుగేళ్ల పాటు పోలీసులకు ముచ్చెటమలు పట్టిస్తూనే ఉన్నాడు. ఖాకీలనే లక్ష్యంగా పెట్టుకుని వారిపై దాడులు చేసిన కిరాతకుడు వికారుద్దీన్. జైళ్లలో పోలీసులనే బెదిరించే కిరాతక చరిత్ర వికార్‌ది. చర్లపల్లి జైలులో ఉన్నప్పుడు జైలు అధికారులపై వికార్ దాడికి దిగాడు. వరంగల్ సెంట్రల్ జైలులో కూడా వికార్ పోలీసులను బెదిరించాడు. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. డీజేఎస్ పేరుతో వికారుద్దీన్ హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించడమే గాకుండా గతంలో సిమిలోనూ క్రియాశీలకంగా పని చేశాడు. 2008 సంతోష్‌నగర్, 2009 శాలిబండ, ఫలక్‌నూమాలో పోలీసులపై జరిపిన కాల్పుల కేసులో వికారుద్దీన్ ప్రధాన నిందితుడు.పోలీసులను కూడా లెక్క చేయని వికారుద్దీన్‌కు భారీ నేర చరిత్ర ఉంది. పలు బాంబు పేలుళ్ల కేసులో వికారుద్దీన్‌కు సంబంధముంది. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఆరుగురు పోలీసులను చంపాడు. శాలిబండ, ఫలక్‌నూమా, సంతోష్‌నగర్ పోలీసులపై దాడి, దేశద్రోహం కేసులో వికారుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వికారుద్దీన్‌కు ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయి. లష్కరే తోయిబాతోనూ సంబంధాలున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. 2008 డిసెంబర్‌లో సంతోష్‌నగర్‌లో పోలీసులపై కాల్పులు, 2009 మే 18న ఫలక్‌నూమాలో పోలీసులపై కాల్పులు, 2010 మే 14న శాలిబండలో పోలీసులపై కాల్పులు జరిపాడు. 2010 జులైలో వికారుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ ¬ంమంత్రిపై దాడి కేసులో వికార్ నిందితుడు. గతంలో చంచల్‌గూడ జైలులో వార్డర్లపై వికార్ దాడి చేశాడు. గతంలో వికార్‌ను అరెస్టు చేసిన సమయంలో అతడి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చినప్పుడల్లా వికారుద్దీన్ తప్పించుకుపోయేందుకు యత్నించేవాడు. పలుసార్లు పోలీసులపై దాడులు కూడా చేశాడు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా ఇలాంటి ప్రయత్నమే చేసి పోలీసులను బెదిరించి పారిపోయే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసుల దాడిలో హతమయ్యాడు.
ఎన్‌కౌంటర్ ఘటనపై రాజ్‌నాథ్ ఆరా
ఎన్‌కౌంటర్‌పై కేంద్రం ఆరా తీసింది. కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి గోయల్ నేతృత్వంలో అధికారుల సమావేశం జరిగింది. డీజీపీ అనురాగ్ శర్మతో కేంద్ర ¬ంశాఖ ఉన్నతాధికారులు ఫోన్‌లో చర్చలు జరిపారు. ఎన్‌కౌంటర్‌పై నివేదికలు ఇవ్వాలని కోరారు. ఇదిలావుంటే ఎన్‌కౌంటర్‌పై కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆందోళనకర పరిస్థితిని దత్తాత్రేయ రాజ్‌నాథ్‌కు వివరించారు. తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఘటనలను ¬ంమంత్రికి వివరించానని దత్తాత్రేయ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై చర్చించారని పేర్కొన్నారు. ఇక్కడ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని అన్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తేనే ఉగ్రవాదుల ఆటకట్టు అవుతుందన్నారు. వారికి స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉందన్నారు. వారికి అధునాతన ఆయుధాలను సమకూర్చాల్సి ఉందన్నారు.