వరదలతో జమ్ముకశ్మీర్‌ అతలాకుతలం

1

స్థంభించిన రవాణా వ్యవస్థ

న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): వరదలతో జమ్ముకశ్మీర్‌ అతలాకుతలమైంది. కశ్మీర్‌ వరద పరిస్థితిపై ప్రధాని మోదీ సవిూక్షించారు. గత రెండుఎకేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీని శ్రీనగర్‌ వెళ్లి వరద పరిస్థితిని సవిూక్షించాలని ప్రధాని ఆదేశించారు.జమ్ముకశ్మీర్లో వరదలపై తక్షణ చర్యలు, తదితర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సవిూక్షించారు. వరదలతో  అతలాకుతలమౌతున్న రాష్ట్రంలో సహాయ చర్యలను పర్యవేక్షించేందుకై కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ ని ఆదేశించారు. గత వారం రోజులుగా కురుస్తున్నవర్షాలతో జీలం నది ప్రమాద స్థాయిని దాటి  ప్రవహిస్తుండటంతో వరద  పోటెత్తడంతో వరద పరిస్థితిని ప్రకటించారు.  దీంతో కేంద్ర  ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ప్రస్తుతానికి వర్షం ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికి అధికారులంటున్నారు.  కొన్నిచోట్ల వదరపోటెత్తినప్పటికీ, తొందరలోనే తగ్గుముఖం పట్టొచ్చని  రాష్ట్ర మంత్రి అబ్దుల్‌ మాజిద్‌ పడార్‌  ప్రకటించారు. మరోవైపు  భారీ వర్షాలతో జమ్ము కాశ్మీర్‌ హైవే పై గత మూడురోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి.   ఏప్రిల్‌ మూడవతేదీవరకు వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనావేస్తోంది.  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా అధికారులు ఇప్పటికే ఆదేశించారు.  అన్ని ముందు జాగ్రత్త చర్యలతో  అప్రమత్తంగా ఉన్నామని వారు ప్రకటించారు.  జాతీయ విపత్తు  నివారణ బృందాలు ఇప్పటికే తరలివెళ్ళిన సంగతి తెలిసిందే.  జమ్ముకశ్మీర్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లాదెన్‌ గ్రామంలో వర్షం కారణంగా ఓ ఇల్లు కూలి 21మంది గల్లంతయ్యారు. బుడ్గాం జిల్లాలోని ఓ ప్రాంతంలో రెండు ఇళ్లు నీట మునిగి 16మంది వరదలో చిక్కుకున్నారు. శ్రీనగర్‌ వద్ద ప్రమాదస్థాయిని మించి జీలం నది ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతవాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శ్రీనగర్‌లోని జేవీఎంసీ ఆస్పత్రిలో వరద నీరు చేరడంతో రోగులను తరలించారు.  శ్రీనగర్‌ వద్ద ప్రమాదస్థాయిని మించి జీలం నది ప్రవహిస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా జమ్ముకశ్మీర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. పరిసర ప్రజలను అప్రమత్తం చేశారు. పలు ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్‌ 3వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో అందాల కాశ్మీరం వరదలతో కకావికలమవుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొండచరియలు విరిగిపడటంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరదలకు 8 మంది మృతి చెందారు. 13 మంది గల్లంతయ్యారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జనజీవనం తీవ్ర ఇబ్బందులు

ఎదుర్కొంటుంది.