*వాగు పై అక్రమ నిర్మాణం. చోద్యం చూస్తున్న అధికారులు

అలంపూర్ జనంసాక్షి* (సెప్టెంబర్ 20) వాగులో అక్రమ కట్టడాలు నిర్మాణం చేస్తే, పట్టణం ముంపునకు గురయ్యే  అవకాశం ఉందని నాటి అడిషనల్ కలెక్టర్ పనిచేసిన  శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.అయితే ప్రస్తుతం ఆయన ఆదేశాలు బేఖాతర్ చేస్తూ, కంచె చేను మేస్తే అనే విధంగా మున్సిపాలిటీ జరుగుతుంది. మునిసిపల్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి వాగులో స్థలాన్ని ఆక్రమణకు గురిచేసి  అక్రమంగా కట్టడాలు నిర్మాణం చేస్తున్నప్పటికి  అలంపూర్ పురపాలక సంఘం అధికారులు చోద్యం చూస్తున్నారని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికాక మిషన్ భగీరథి పైపులైన్ కు స్వతహాగా వారే కనెక్షన్ ఇచ్చుకొని  కట్టడాలు చేపడుతున్నారని, మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేసే వారే  వాగులో అక్రమ కట్టడం నిర్మాణం చేపట్టడం చూసిన,కొందరు ఇదే అదు నుగా భావించి  దాదాపు  20 మంది వ్యక్తులు వాగులో స్వతహాగా హద్దులు ఏర్పరచుకొని, రాళ్ళు,ఇసుక సిద్ధం చేసుకొంటున్నారని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
గత 6 నెలల క్రితం బస్టాండ్ దగ్గర మరుగుదొడ్ల స్థలంలో పేద విధవరాలు ఇళ్ళు కట్టుకుంటే జేసీబీ తో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తొలగించారని,
మరి ఇక్కడ వాగుపై ఇల్లు నిర్మిస్తున్న   అధికారులు  ఏమీ అనడం లేదని పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సామాన్య ప్రజలకొక న్యాయం, మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి ఒక న్యాయమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అపుడు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు తాత్కలికంగా కట్టడాలను కూల్చకుండా ఆపడం జరిగింది.
ఇలా అక్రమంగా కట్టడాలు నిర్మించుకుంటూ పోతే  వరదముంపు వచ్చే ప్రమాదం ఉందని,రెవిన్యూ సిబ్బంది కూడా జోగుళాంబ వాగులో కట్టడాలకు అనుమతించవద్దని ఆదేశాలు ఇచ్చారని,
ఇన్నీ తెలిసిన మున్సిపల్ సిబ్బందే కట్టడాలకు సిద్ధపడడం విడ్డూరంగా ఉందని,
 ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  చొరవ తీసుకొని ఈ అక్రమ కట్టడాలు నిర్మించకుండా చర్యలు తీసుకోని, అలంపూర్ పట్టణం వరదలకు గురికాకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Attachments area