వాజ్‌పేయి ఇంటికి వెళ్లి భారతరత్న ఇవ్వనున్న రాష్ట్రపతి ప్రణభ్‌

1

పెద్ద మనసుతో ప్రోటోకాల్‌ పక్కకు

న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి):  మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్‌ బిహారీ వాజపేయికి భారత రత్న పురస్కారాన్ని అందజేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రోటోకాల్‌ను  పక్కన పెట్టబోతున్నారు. ఈ నెల 27న రాష్ట్రపతి స్వయంగా వాజపేయి నివాసానికి వెళ్లి దేశ అత్యున్నత అవార్డును భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు బుధవారం రాష్ట్రపతి భవన్‌ విూడియా వ్యవహారాల ప్రతినిధులు వెల్లడించారు.రెండుసార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశ ఆర్థికాభివృద్ధిలో తనదైన ముద్రవేసిన వాజపేయి ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన అనారోగ్యంతో పాటు ఆల్జీమర్స్‌తో బాధపడుతున్నారు.  ఇక  స్వాతంత్య సమరయోధుడు, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్‌ మోహన్‌ మాలవ్య కూడా  భారతరత్న పురస్కారానికి  ఎంపికయ్యారు. గత డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం  ఇద్దరికి భారతరత్నలను ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత రత్న అవార్డుకు ఎంపికయిన ప్రధానుల్లో అటల్‌ ఏడో వ్యక్తి. గతంలో ప్రధానులుగా పనిచేసిన జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, మొరార్జీ దేశాయ్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, గుల్జారీ లాల్‌ నందా ఈ పురస్కారాన్ని పొందారు.