వాస్తవ విరుద్ధంగా బడ్జెట్‌

4

అంకెల గారడీ

జానా విమర్శ

హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి):

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాని దేనని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. తెలం గాణ రాష్ట్రంలో ఆచరణకు దూరంగా బడ్జెట్‌ను సర్కారు ప్రవేశపెట్టిందని ఆరోపించారు. తెలంగా ణ అసెంబ్లీలో బడ్జెట్‌పై జానారెడ్డి చర్చను ఆరం భిస్తూ గడచిన అయిదునెలల్లో ఏం ఖర్చు చేశారో బడ్జెట్‌లో చెప్పలేదన్నారు. పాత, కొత్త బడ్జెట్‌లలో అంకెలేవిూ మారలేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించి మాట్లా డుతూ… ఇది నిజంగా నిర్మాణాత్మక బడ్జెటేనా? కేంద్రం నుంచి విూరనుకున్న నిధులు రావు. మా కొచ్చిన కేంద్రం నిధులు కూడా విూకు వస్తాయా? 3.25 శాతం అప్పు తెచ్చుకోవచ్చు. ప్రధాని దగ్గరకు పోయినా లాభం ఉండదు. కేంద్రం నుం చి రూ. 1150 కోట్లు అప్పురాదు. ప్రభుత్వ నినా దానికి బడ్జెట్‌ దగ్గరగా లేదు. తెలంగాణ అభివృ ద్ధికి సహకరిస్తూ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సల హాలిస్తం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.  విధానమేవిూ లేకుండాబ్జడెట్‌ అలంకార ప్రాయంగా ఉంది… ఈ బ్జడెట్‌కు విశ్వసనీయత లేదన్నారు. బ్జడెట్‌ చదువుతుంటే వూహాలోకంలో ఉన్నట్టుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీనే అని గుర్తు చేశారు. తాము సమర్థించి ఉండకపోతే తెరాస ఆందోళన పనిచేసేది కాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం వల్లే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్‌ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదన్నారు. బడ్జెట్‌ కేటాయింపులు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.  చర్చ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్లో చూపిన మేరకు ఆదాయాలు రావని, ట్యాక్స్‌, గ్రాంటళస్లో ప్రభుత్వం చూపినంత రాబడి ఉండదన్నారు. రూ.20వేల కోట్లు నిధులు తగ్గుతాయని, ఈ మేరకు అభివృద్ధి పథకాలకు నిధుల కోత తప్పదన్నారు. బడ్జెట్‌ అలంకార ప్రాయంగా ఉందని, నిర్ధిష్టంగా, నిర్మాణాత్మకంగా లేదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే బడ్జెట్‌ గణాంకాలు గందరగోళపరుస్తున్నాయని, ఇరిగేషన్లో నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  విద్యుత్‌ విషయంలో కాంగ్రెస్‌ ముందుచూపుతో ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లకు సరిపోయే కేటాయింపులు లేవని, దళితులకు మూడెకరాల భూమి పరిస్థితి అలాగే ఉందన్నారు.  రుణమాఫీ అంశం ఇటు రైతులకు, ప్రజలకు ఇబ్బందిగా ఉందన్నారు. బడ్జెట్‌ అంటే కేవలం అలంకారప్రాయం కాకూడదన్నారు. బడ్జెట్‌ విశ్వసనీయతకు దగ్గర్లో లేదని తెలిపారు. స్పష్టమైన విధానాలతో కూడిన బడ్జెట్‌ కావాలన్నారు. ఒక్క అంకే కూడా మారకుండా మళ్లీ అవి అంకెలను రివైజ్డ్‌ అయ్యాయని చెప్పారు. మిషన్‌ కాకతీయలో చెరువుల పునురద్దరణ మంచిదే కానీ అన్ని చెరువులను ఒకేసార తసీఉకోవడం కన్నా అవసరం ఉన్నవే చేపడితే బాగుండేదన్నారు. పూడిక అవసరమున్నదీ అవసరం లేనిదీ గుర్తించి చేపట్టాల్సి ఉందన్నారు. దీనిపై మంత్రి హరీష్రావు జోక్యం చేసుకుంటూ తాము నిస్పక్షపాతంగా రాష్ట్రంలోని అన్ని మండలాల చెరువులను తీసుకున్నామని అన్నారు. ఇంకా సూచనలు ఇస్తే తీసుకుంటామని అన్నారు. అయితే నిధుల కేటాయింపు, ఖర్చు తదితర వ్యవహారాల్లో జానా సర్కార్‌ తీరును సుతిమెత్తగా విమర్శించారు.