వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌

1

హైదరాబాద్‌,ఏప్రిల్‌15(జనంసాక్షి): సిమి ఉగ్రవాది వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై ళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపించాలని కోరుతూ ఆయన తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు అయన బుధవారం  పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, గత వారం వరంగల్‌ జైలు నుంచి నగరంలోని నాంపల్లి కోర్టుకు వికారుద్దీన్‌తోపాటు మరో నలుగురు నిందితులను విచారణ కోసం తీసుకు వస్తుండగా వాళ్లు ఎస్కార్ట్‌ పోలీసుల నుంచి తుపాకులు లాక్కొని పోలీసులపై తిరగబడ్డారు. దీంతో ఎస్కార్ట్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు ఐదుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇది బూటకపు ఎన్‌కౌంటరని కోర్టులో వికారుద్దీన్‌ తండ్రి పిటిషన్‌ వేశారు.  ఎదురు కాల్పుల ఘటనపై విచారణ జరిపించాలని వికారుద్దీన్‌ తండ్రి  కోరుతున్నాడు.  గతవారం కోర్టులో విచారణకు తరలిస్తుండగా పోలీసులతో ఘర్షణ పడిన వికారుద్దీన్‌ ముఠా సభ్యులు ఐదుగురు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే.