విజయ్ మాల్యా పాస్‌పోర్టు రద్దు
న్యూఢిల్లీ,ఏప్రిల్ 24(జనంసాక్షి): ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా పాస్‌పోర్ట్‌ను విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసింది. మాల్యాను తిరిగి భారత్ రప్పించడానికి పాస్‌పోర్ట్ అధికారులతో చర్చలు జరపనున్నారు.వివిధ బ్యాంకులకు విజయ్ మాల్యా 9వేల కోట్లు రుణం చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాల్యా మార్చి నెలలో భారత్ నుంచి లండన్ వెళ్లిపోయారు. మాల్యా ముంబయి కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది. మాల్యా కోర్టుకు హాజరుకాకపోవడంతో గత వారం కోర్టు మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే.