విదేశీ పర్యటనకు ప్రధాని

11

దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల్లో ఐదు రోజుల పర్యటనకు ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లారు. వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. హిందూ సముద్ర తీర ప్రాంత దేశాలన్నింటితో సత్సంబంధాలు కొనసాగించడం తమ లక్ష్యమన్నారు. ఈ పర్యటన వల్ల సీషెల్స్‌, మారిషస్‌, శ్రీలంకలతో భారత్‌ బంధం మరింత బలపడుతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. పొరుగు దేశాలతో స్నేహపూర్వకంగా ఉండి భద్రతాపరమైన అంశాల్లో అందరికీ సహకరిస్తామన్నారు. ప్రధాని నేరుగా సీషెల్స్‌ వెళ్లారు. రేపు అక్కడి నుంచి మారిషస్‌ చేరుకుంటారు. 12న మారిషస్‌లో ఉండి 13, 14 తేదీల్లో శ్రీలంకలో పర్యటిస్తారు. 15న భారత్‌ తిరిగివస్తారు.