విద్యార్థినీలకు ప్యాడ్లు పంపిణీ

మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి
వనపర్తి బ్యూరో అక్టోబర్ 04 (జనంసాక్షి)

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులు, ప్రజల మధ్యలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన దాదాపు 30 మంది విద్యార్థినీలకు మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి , నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి ప్యాడ్లును పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి , మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమేష్ గౌడ్ , మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ , పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆవుల రమేష్, పరంజ్యోతి, మండల యువజన సంఘం అధ్యక్షుడు రాము, బిఆర్ ఎస్ నాయకులు నారాయణ దాస్ కిట్టు , నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.