విద్యుత్ కార్మికుల ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి
– పారదర్శకంగా సబ్ స్టేషన్ ఆపరేటర్ల బదిలీలు చేపట్టాలి
– విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి
– టి ఆర్ వి కే ఎస్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి
పాలకుర్తి. సెప్టెంబర్ 13 (జనంసాక్షి)
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న జేఎల్ఎం లకు ఏఎల్ఎంలుగా ప్రమోషన్లు వెంటనే కల్పించాలని,సబ్ స్టేషన్లలో ఆపరేటర్లుగా పనిచేస్తున్న విద్యుత్ కార్మికుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని టి ఆర్ వి కె ఎస్ (విద్యుత్ కార్మిక సంఘం) జిల్లా అధ్యక్షుడు అల్వాల మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో టి ఆర్ వి కె ఎస్ స్టేషన్ ఘన్పూర్ డివిజన్ అధ్యక్షుడు కోట రాజలింగం అధ్యక్షతన జరిగిన స్టేషన్గన్పూర్ డివిజన్ స్థాయి సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ టి ఆర్ వి కే ఎస్ విద్యుత్ కార్మికుల పక్షాన ఉండి హక్కులను సాధించుకుంటుందని తెలిపారు. విద్యుత్ శాఖలో జేఎల్ఎంలుగా పనిచేస్తున్న కార్మికులను ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పదోన్నతులతో పాటు పిఎఫ్ ను వర్తింపజేయాలని, మెరిట్,సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఏళ్ల తరబడిగా సబ్ స్టేషన్లలో ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఆర్టిజన్ల బదిలీలు వారు కోరుకున్న సబ్ స్టేషన్ లకు వెళ్లే విధంగా కృషి చేస్తామని తెలిపారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారంలో టి ఆర్ వి కె ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. అన్మాండ్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని వారిని వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఘన్పూర్ డివిజన్ కార్యదర్శి నాగబెల్లి ప్రసాద్,
బీ.వెంకటేశ్వర్లు ,సునీల్ ,శ్రీనివాస్ ,వెంకటస్వామి ,సోమనాదం ,యాదగిరి ,బాలాజీ ,రాజయ్య ,సంతోష్,ఉబ్బని వెంకటేశ్వర్లు లు పాల్గొన్నారు.