విభజన సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చేనా..?
విభజన జరిగింది. రెండు రాష్టాల్ల్రో కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరి రాజ్యమేలుతున్నాయి. అయినా చిక్కుముళ్లు ఇంకా వీడడం లేదు. నత్తనకన పనులు సాగుతున్నాయి. సామాన్యులకు ఊరట మాత్రం లభించడం లేదు. గోడు వెళ్లబోసుకున్నా కనికరించే స్థాయిలో ప్రభుత్వ చర్యలు ఉండడం లేదు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రచార పటాటోపం తప్ప మరోటి కానవరావడం లేదు. కార్పోరేట్ కంపెనీలకు ఎంత దగ్గరయితే అంతమంచిదన్న ధోరణిలో బిజెపి ఉంది. ఈ దశలో విభజన జరిగి రెండు కొత్త రాష్టాల్రు ఏర్పడ్డా వాటి సమస్యలను గాలికి వదిలేశారు. విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయని స్వయంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అంగీకరించినా వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదు. కనీసం ఓ కమిటీని వేసి ఉన్న లోపాలను గుర్తించి, పరిష్కరించే చొరవ చూపడం లేదు. అంటే ప్రభుత్వం ఎంత నిర్తిప్తంగా ఉందో గమనించవచ్చు. ప్రచారం కొంతమేరకు మాత్రమే పనికి వస్తుందని బిజెపి గుర్తుంచుకోకపోవడం వల్లనే ఢిల్లీ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా రెండు రాష్టాల్ర మధ్య ఉన్నా సమస్యలను పరిష్కరించేప్రయత్నం సాగాలి. అందుకు బిజెపి నేతలు తమవంతుగా కృషి చేయాలి. ఈ విషయంలో ఎపి కాంగ్రెస్ కొంతయినా కదలిక తీసుకుని వచ్చిందనే చెప్పాలి. హడావిడిగా విభజన చేసి, ఎవరితోనూ చర్చించకుండా ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం లేకుండా చేశాయి. అయితే ఇచ్చిన హావిూలపై ఎపికి ప్రత్యేక ¬దా తదితర అంశాలపై పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి చేస్తున్న పోరాటం కొంత కదలిక తీసుకుని వచ్చిందనే చెప్పాలి. ఆంధప్రదేశ్ కు ప్రత్యేక ¬దా అంశంపై ఆయన సోనియాను, మన్మోహన్‌ను కలసి పరిస్థితిని వివరించారు. ఇక్కడ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురించి వివరించారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్నప్పటికీ టిడిపి పెద్దగా సాధించుకున్నది ఏదీ లేదు. కేంద్రంతో సఖ్యత వల్ల నిధులు పెద్దగా రాబట్టుకోవడం లేదా పనులు చేయించుకోవడం జరుగుతుందని టిడిపి భావించినా అంతగా ప్రయోజనం కలగడం లేదు. ఇప్పుడు టిఆర్‌ఎస్ కూడా ఇదే విధానంతో ముందుకు పోవాలని చూస్తోంది. నిజానికి రాష్టాల్రకు జరిగిన అన్యాయాలపై పోరాటాల ద్వారా సాధించుకోవాలి. కేంద్ర పెత్తనాన్ని తిప్పటి కొట్టేలా చూడాలి. కానీ స్నేహంగా ఉన్నా పనులు జరగడం లేదు. ఈ అంశంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ పార్టీ బయటన పోరాటం చేస్తూ విబజన చట్టం మేరకు రావాల్సి అంశాలపై పోరాడుతోంది. రఘువీరారెడ్డి ప్రత్యేక ¬దా కోసం అంటూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చర్చల్లో నానుతోంది. ఆయన ఢిల్లీకి వెళ్లి సోనియాకు విన్నవించడం ఆమె ప్రధాని మోడీకి లేఖరాయడం తదితర అంశాలు కొంద కదలిక తీసుకుని వచ్చేవిగా ఉన్నాయి. రాష్ట్ర విభజన దెబ్బకు అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ బతుకు జీవుడా అంటూ ఇఫ్పుడు ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిందనడానికి కోటి సంతకాల సేకరణ ఉదాహరణగా చెప్పుకోవాలి. రాజధాని రైతుల భూసేకరణ సమస్యతోపాటు ప్రత్యేక ¬దా విషయంలో కాంగ్రెస్ దూకుడుగానే వెళుతోంది. కోటి సంతకాల ఉద్యమం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయం ఎలా ఉన్నా సమస్యలపై రంగంలోకి దిగిందన్న విషయం మాత్రం గుర్తించాలి. ఆంధప్రదేశ్ కు ఎంతో ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక ¬దా విషయంలో ఎక్కడలేని కదలిక తీసుకురావటంలో విజయం సాధించారు. నిజానికి విభజన సమయంలో చేసిన పరపాట్ల కారణంగా ఇవాళ అనేక సమస్యలను ఇరు తెలుగు రాష్టాల్రు ఎదుర్కొంటున్నాయి. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న రీతిలో విభజించి పెట్టారు. అందుకే ప్రత్యేక ¬దాతో పాటు సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ తీసుకోవాలి. వాస్తవానికి ప్రత్యేక ¬దా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా చేతులెత్తేశారు. కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో కేంద్రం నుంచి ప్రత్యేక ¬దా అనుమానమేనని,మిత్రపక్షంగా ఉన్నందున పెద్దగా ఒత్తిడి చేయలేమని విస్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ¬దాపై గళమెత్తిన వెంకయ్యనాయుడు కూడా అధికారంలోకి వచ్చాక ‘ప్రత్యేక ¬దా’కు ఇతర రాష్టాల్రు అభ్యంతరం చెబుతున్నాయని..ఇది అంత తేలిగ్గా సాగే అంశం కాదని పదే పదే ప్రకటించారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తొలుత ఐదేళ్ల పాటే ప్రత్యేక ¬దా ఇవ్వాలని ప్రతిపాదిస్తే పదేళ్ళ పాటు కావాలని రాజ్యసభలో పట్టుబట్టి మరీ పంచాయతీ పెట్టారు. కానీ అధికారంలోకి రాగానే సీన్ రివర్స్ అయింది. రఘువీరారెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్ లతో భేటీ ప్రత్యేక ¬దా అంశంపై చర్చించటంతో వేడి మరింత పెరిగింది. అయితే దీనిపై సోనియా ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రస్తావిస్తేనే మంచిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేక ¬దాపై ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించటం ద్వారా కొంతయినా ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. విభజన చట్టం హావిూ ఇచ్చిన మేరకు ప్రత్యేక ¬దాపై కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి రోజుకో పిల్లిమొగ్గ వేస్తూ రాష్ట్ర ప్రజలతో పరిహాసమాడుతోంది. రాష్ట్ర విభజన మూలంగా ఆంధ్ర ప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు, కొత్త రాజధాని నిర్మాణానికి ఉదారంగా సాయం అందిస్తామన్న హావిూ గురించి అడిగితే అలా ఇవ్వాలని చట్టంలో ఎక్కడుందో చూపండి అని ఎదురు ప్రశ్నిన్నారు. విభజన చట్టంలో లోపాలను సవరిస్తామంటున్న వారు ఈసమావేవాల్లోనే దీనిపై చర్చించి చిత్తశుద్దిని చాటుకోవాలి.