విభజన హామీలపై ప్రత్యేక అధికారి

4

న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి):

విభజన చట్టంలోని హావిూల అమలుపై కేంద్రంలో కదలిక వచ్చింది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న దశనుంచి వేగంగా అడుగులు వేస దశకు చేరుకుంది. ప్రధానంగా వివిధ అంశాలపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం వెంటనే రంగంలోకి దిగింది. దీనికితోడు లోక్‌సభలో యూపిఎ ఛైర్‌పర్సన్‌ విభజన అంశాలపై డిమాండ్‌ చేయడం, ఇదే సమయంలో ఎపిలో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే బిజెపి నేతలు కూడా నేరుగా ఢిళ్లీకి వెళ్లి ప్రధానిని కలిశారు. దీంతో విభజన అంశాలను పరిశీలించి వాటిని  పర్యవేక్షించేందుకు ¬ంశాఖ ఏకే సింగ్‌ను నియమించింది. ¬ంశాఖ ప్రత్యేక అధికారిగా నియమితులైన ఏకే సింగ్‌ శుక్రవారం   హైదరాబాద్‌కు  రానున్నారు.  ఇరు రాష్టాల్రసీఎస్‌లతో ఏకే సింగ్‌ భేటీ కానున్నట్లు తెలిసింది. దీంతో ఉద్యోగుల విభజన మొదలుకుని వివిధ సంస్థల బదిలీ వరకు అనేక అంశాలను చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పార్టీ పరంగానే పావులు కదిపారు. ఎపి బిజెపి నేతలు ఢిల్లీలో అమిత్‌షాను కలిశారు. విభజన చట్టంలోని హావిూలను అమలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు విజ్ఞప్తి చేశామని ఎంపీ హరిబాబు చెప్పారు. విశాఖలో సీజీహెచ్‌ను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి జేపీ నడ్డా, ¬ంశాఖ నియమించిన అధికారి ఏకె సింగ్‌లు రాష్ట్రంలో పర్యటించాలని కోరామని హరిబాబు చెప్పారు. హావిూల అమలుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా రావాల్సిందేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తనను, ప్రధానిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. ప్రత్యేక ¬దా విషయంలో కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలపై రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించామని, రాష్టాన్రికి సంబంధించి ఆయన కూడా చొరవ తీసుకుంటున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆంధప్రదేశ్‌కు  ప్రత్యేక ¬దా కల్పించాలని కోరుతూ ఏపీ బీజేపీ నేతలు హస్తినబాట పట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో గురువారం  పలువురు ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ¬ం మంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014 లోని వాగ్ధానాలపై చర్చించారు. రెండు తెలుగు రాష్టాల్రకు న్యాయం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్‌ హావిూ ఇచ్చారు. అనంతరం వెంకయ్యనాయుడు విూడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక ¬దా విషయంలో తన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు వక్రీకరించారన్నారు. ఓవైపు ¬దా కావాలని డిమాండ్‌ చేస్తూనే మరోవైపు పార్లమెంటులో జరగాల్సిన పక్రియను కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని విమర్శించారు. తాము మాత్రం విభజనకు సంబంధించి హావిూల అమలుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేకపోవడంతోనే విభజనచట్టంలో ప్రత్యేక ¬దా చేర్చలేదని వెంకయ్య వ్యాఖ్యానించారు. చేసిందంతా చేసి తనపైనా, తనపార్టీపైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక¬దా కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని హావిూలను దశలవారీగా అమలు చేస్తామన్న వెంకయ్య ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌సైతం ఏపీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారన్నారు. ప్రధాని దిష్టిబొమ్మల దహనం సరికాదని ఆయన తెలిపారు. ఏపీ విభజనచట్టం అమలు పర్యవేక్షణకు నోడల్‌ అధికారిని నియమించాలని రాజ్‌నాథ్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. అదనపు కార్యదర్శి ఏకేసింగ్‌ను నోడల్‌ అధికారిగా నియమించేందుకు రాజ్‌నాథ్‌ అంగీకారం తెలిపారని వెంకయ్య పేర్కొన్నారు.

ఇక కేంంద్ర మంత్రి , టిడిపి సీనియర్‌ నాయకుడు సుజనా చౌదరి కొద్ది రోజుల క్రితం కేంద్రం నుంచి పది వేల కోట్ల రూపాయల మేర రాబోతున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న నిదుల గురించి వివరంగా చెప్పారు. కాని మరి ఏమైందో తెలియదు కాని , ఇప్పుడు ఆయన ఎపికి రావాల్సిన వాటిపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పని తాము చేస్తున్నామని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. టిడిపి,బిజెపి ఎమ్‌.పిలు సుజనా చౌదరి ఇంటి వద్ద సమావేశం అయి ఎపికి సంబందించిన అంశాలు చర్చించారు.కేంద్రం నుంచి రావల్సిన నిదులు, వాటిని సాదించడానికి చేయవలసిన ప్రయత్నాల గురించి చర్చించారు.