ముంబయి: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలం వరకు అందరిలాగే వీరిద్దరూ తమ ప్రేమను బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు తమ ప్రేమ విషయం చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడటంలేదు. మొన్నటికి మొన్న మహిళా దినోత్సవం రోజు తన జీవితంలో రెండో యువతి అనుష్క శర్మ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విరాట్ ఇప్పుడు ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫొటోలో అనుష్కతో కలిసి దిగిన ఫొటోను పెట్టేశాడు.క్రికెటర్ యువరాజ్‌సింగ్, హాజెల్ కీచ్ వివాహ వేడుకలో కలిసి దిగిన ఫొటో అది. విరాట్ ఇలాంటి ఫొటో పెట్టడం కూడా ఇదే తొలిసారి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్లను సంపాదించుకున్న విరాట్ ఫొటో చూసి ‘విరుష్క’ అభిమానులు ఇక పెళ్లి భాజాలు ఎప్పుడు మోగనున్నాయంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.