వివాదాస్పద భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

6

కాంగ్రెస్‌, బీజేడీ, టీయారెస్‌ల వాకౌట్‌

రాజ్యసభలో ఎలా? అధికారపక్షం మల్లగుల్లాలు

దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): భూసేకరణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ బిల్లుపై సభలో చర్చ జరిగింది. సాయంత్రం బిల్లుపై ఓటింగ్‌ చేపట్టగా బిల్లు ఆమోదం పొందింది. ప్రభుత్వం ప్రతిపాదించిన 11 సవరణలు ఆమోదం పొందగా విపక్షాల సవరణలు వీగిపోయాయి. భూ సేకరణ బిల్లుకు శివసేన, అకాలీదళ్‌, తెదేపా బిల్లుకు మద్దతు తెలపగా; కాంగ్రెస్‌, బీజేడీ, తెరాస సభనుంచి వాకౌట్‌ చేశాయి. భూ సేకరణ బిల్లుపై ఓటింగ్‌ ముగిసిన అనంతరం స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వేశారు. కాగా రాజ్యసభలో బిల్లు ఆమోదింప జేయటం ఎలా అని అధికారపక్షం మల్లగుల్లాలు పడుతోంది. రాజ్యసభలో అధికార పక్షానికి కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడం అధికారపక్షాన్ని కలవరపెడుతోంది.