వివాద భూములపై ఉదాసీనత వద్దు
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్,ఏప్రిల్ 21(జనంసాక్షి): న్యాయస్థానాల్లో వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములపై సీఎం కేసీఆర్ సవిూక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూవివాదాలకు సంబంధించిన కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా అధికారులు చొరవ చూపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రూ.వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసులు రాష్ట్రంలోని అనేక కోర్టుల్లో ఏళ్ల తరబడి నడుస్తున్నాయి. భూములు కేసుల్లో ఉండడం వల్ల వాటిని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించలేకపోతున్నాం. గత ప్రభుత్వం ఉదాసీనత వల్ల హైదరాబాద్‌లో అనేక చోట్ల వివాదాల్లో ప్రభుత్వం భూములను కాపాడటం కన్నా కబ్జాదారులకే అండగా ఉండడంతో నష్టం జరిగింది. గతంలో ప్రభుత్వం అండతోనే భూముల ఆక్రమణ జరగడం దురదృష్టకరం. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.