వీడుకోలు సమావేశం..
చిలప్ చేడ్/6సెప్టెంబర్/జనంసాక్షి:- మండల పరిధిలోని బండపోతుగాళ్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసిన స్వప్న బదిలీపై వెళ్లగా ఆమెకు ఉపాధ్యాయులు, పిల్లలు ఘనంగా వీడుకోలు పలికారు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ ఫొటోకు పూలమాల వేశారు. అనంతరం బదిలీపై వెళ్తున్న స్వప్నకు శాలువతో సన్మానం చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రధానం అని అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు వారి బంగారు భవిష్యత్తకు బాటలు వేస్తారు. గురువులు ఎప్పుడూ తమ యొక్క విద్యార్థులు చాలా ఉన్నతంగా ఎదగాలనే కోరుకుంటారు. ఉపాద్యాయులు మనలోని అజ్ఞానాన్ని తొలగించి, మన జీవితాల్లో వెలుగులు నింపుతారన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న స్వప్న మాట్లాడుతూ తాను ఇంతమంచి పాఠశాల నుండి బదిలీపై వెళ్లడం బాధగా ఉన్న ఉద్యోగ రీత్యా ఇవీ తప్పవన్నారు. తనకు ఇంతమంచి వీడ్కోలు పలికిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు తను కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంచంద్రారెడ్డి, ఉపాధ్యాయులు వెంకటరమణ, సునీల్, స్వప్న.. సర్పంచ్ ఇస్తరి. ఎంపిటిసి మల్లమ్మ, smc చైర్మన్ రాములు, వైస్ చైర్మన్ విభిషన్, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి. పంచాయతీ కార్యదర్శి ఆనంద్. అంగన్వాడీ మేడం ధనలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు..