వీరమరణం పొందారు

5

ధైర్యసాహసాలు ప్రదర్శించారు

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

అసాంఘిక శక్తులను సహించం

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌4(జనంసాక్షి): సంఘ విద్రోహశక్తులను తుదముట్టించడంలో తెలంగాణ పోలీసులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. నల్లగొండ జిల్లాలో  దుండగుల కాల్పుల్లో మరణించిన పోలీసుల త్యాగం గొప్పదని సిఎం తెలిపారు.  ప్రాణత్యాగం చేసిన ముగ్గురిని  యువకిశోరాలుగా సిఎం అభినందించారు.  జానకీపురం ఎన్‌కౌంటర్‌పై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌… సంఘవిద్రోహ శక్తులను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. దుండగుల విషయంలో పోలీసులు స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణలో పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులను నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. దుండగుల కాల్పుల్లో మరణించిన కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజు, ¬ంగార్డు మహేష్‌ త్యాగం మరువలేనిదన్నారు. మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలనూ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో అమరులుగా నిలిచిపోతారు అని చెప్పారు. సూర్యాపేట కాల్పులు, ఆ తర్వాతి ఘటనల్లో పోలీసులది స్ఫూర్తిదాయకమైన పాత్ర అని కేసీఆర్‌ చెప్పారు. కాల్పుల్లో చనిపోయిన కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజు, ¬ంగార్డు మహేష్‌లది గొప్ప త్యాగమన్నారు. ఈ ముగ్గురూ అమరులని, తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని సీఎం తెలిపారు. మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన అన్నారు. కాల్పుల్లో గాయపడ్డవారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే వైద్యం చేయిస్తామని తెలిపారు.

గాయపడిన సిబ్బంది గురించి పోలీసు అధికారులను ముఖ్యమంత్రి ఆరా తీశారు. సంఘవిద్రోహ శక్తుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా కఠినంగా పనిచేస్తుందని చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదిలావుంటే శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌తో డీజీపీ అనురాగ్‌శర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో కాల్పుల ఘటనలను సీఎంకు డీజీపీ వివరించారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో పోలీసులు ధైర్య సాహసాలతో పనిచేశారని, విద్రోహశక్తుల్ని అడ్డుకునేందుకు ప్రాణాలనూ లెక్కచేయలేదన్నారు. కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజు, ¬ంగార్డ్‌ల త్యాగం గొప్పదని కేసీఆర్‌ పేర్కొన్నారు. కామినేనిలో చికిత్స పొందుతున్న సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసించారు. సంఘవిద్రోహ శక్తులను అదుపు చేయడంలో పోలీసులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయన అన్నారు.